Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: వేలం తర్వాత డేంజరస్‌గా ముంబై ఇండియన్స్.. తుది జట్టు అంచనా ఇదే!

IPL 2024 వేలంలో ముంబై ఇండియన్స్ స్మార్ట్‌గా వ్యవహరించింది. తమకు అందుబాటులో ఉన్న బడ్జెట్ ప్రకారం.. జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరిగిన ఈ మినీ వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 17.75 కోట్ల పర్స్ మనీతో బరిలోకి దిగింది. తక్కువ డబ్బే ఉన్నా.. 8 మంది కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

ఇందులో నలుగురు ఓవర్‌సీ ఆటగాళ్లు ఉండగా.. మరో నలుగురు స్వదేశీ ప్లేయర్లు ఉన్నారు. వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్లకు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను తీసుకుంది. జట్టు బలహీనతలను అధిగమించింది. జోఫ్రా ఆర్చర్‌కు రిప్లేస్‌మెంట్‌గా సౌతాఫ్రికా యువ సంచలనం గెరాల్డ్ కోయిట్జీ(రూ. 5 కోట్లు)ని తక్కువ ధరకే కొనుగోలు చేసింది. అలాగే మరో ఓవర్‌సీస్ పేసర్ స్లాట్‌ను భర్తీ చేసేందుకు జూనియర్ మలింగగా గుర్తింపు పొందిన శ్రీలంక బౌలర్ నువాన్ తుషార్‌(రూ.4.8 కోట్లు)ను తీసుకుంది.

IPL 2024: Mumbai Indians strongest playing 11 after Mini Auction

స్పిన్ ఆల్‌‌రౌండర్ కోటాలో అఫ్గానిస్థాన్ స్పిన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీని(రూ.1.50 కోట్లు) తీసుకుంది. బ్యాకప్ ప్లేయర్లుగా దేశవాళీ ఆటగాళ్లను రూ. 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల సంఖ్య మొత్తం 25‌కు చేరుకోగా.. ఇంకా ఆ జట్టు పర్స్‌లో రూ.1.05 కోట్లు ఉన్నాయి.

వేలానికి ముందే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది. టీమ్ సారథ్య బాధ్యతలను కూడా హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. అలాగే వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. రూ. 50 లక్షల అతని కనీస ధరకు తీసుకుంది.

హార్దిక్ పాండ్యా కోసం కామెరూన్ గ్రీన్‌ను ఆర్‌సీబీకి ట్రేడ్ చేసిన ముంబై ఇండియన్స్.. వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

టీమ్ కాంబినేషన్..
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగనుండగా.. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టీమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌లో ఆడనున్నారు. రోమారియో షెఫర్డ్, గెరల్డ్ కోయిట్జీ, జస్‌ప్రీత్ బుమ్రాలు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. స్పిన్నర్లుగా శ్రేయస్ గోపాల్, పియూష్ చావ్లాలు బరిలోకి దిగనున్నారు.

తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టీమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, రోమారియో షెఫెర్డ్, గెరాల్డ్ కోయిట్జీ, జస్‌ప్రీత్ బుమ్రా,శ్రేయస్ గోపాల్, పియూష్ చావ్లా

ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు:
గెరాల్డ్ కోయిట్జీ, దిల్షాన్ మధుషంక, శ్రేయస్ గోపాల్, నువాన్ తుషార్, నమాన్ ధిర్, అన్షుల్ కంబోజ్, మహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రేవిస్,సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, శామ్స్ ములాని, నేహాల్ వధేరా, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తీకేయ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జాసన్ బెహ్రెండార్ఫ్, రోమారియో షెఫర్డ్(ట్రేడింగ్), హార్దిక్ పాండ్యా(ట్రేడింగ్).

Story first published: Friday, January 5, 2024, 16:44 [IST]
Other articles published on Jan 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+