Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ముంబై ఇండియన్స్ షెడ్యూల్ ఇదే!

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ టీమ్‌ అయిన ముంబై ఇండియన్స్.. మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2024 క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందుగా 21 మ్యాచ్‌ల వివరాలను మాత్రమే వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మిగతా 52 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ ఫస్టాఫ్ షెడ్యూల్‌లో ముంబై ఇండియన్స్ మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

IPL 2024: Mumbai Indians Schedule 2024, Time Table, Timings, Dates, Venues Details

ఇందులో రెండు మ్యాచ్‌లు తమ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడే మైదానం వేదికగా ఆడనుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌ బరిలోకి దిగనుంది. ఫస్ట్ మ్యాచ్ హార్దిక్ పాత ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌తోనే ఆడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024 షెడ్యూల్

మ్యాచ్-1: మార్చి 24, గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, అహ్మదాబాద్( రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-2: మార్చి 24, సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్, హైదరాబాద్( రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-3: ఏప్రిల్ 1, ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, ముంబై( రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-4: ఏప్రిల్ 7, ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, (మధ్యాహ్నం 3.30 గంటలకు)

ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టీమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, రోమారియో షెఫెర్డ్, గెరాల్డ్ కోయిట్జీ, జస్‌ప్రీత్ బుమ్రా,శ్రేయస్ గోపాల్, పియూష్ చావ్లా

ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు:
గెరాల్డ్ కోయిట్జీ, దిల్షాన్ మధుషంక, శ్రేయస్ గోపాల్, నువాన్ తుషార్, నమాన్ ధిర్, అన్షుల్ కంబోజ్, మహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రేవిస్,సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, శామ్స్ ములాని, నేహాల్ వధేరా, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తీకేయ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జాసన్ బెహ్రెండార్ఫ్, రోమారియో షెఫర్డ్(ట్రేడింగ్), హార్దిక్ పాండ్యా(ట్రేడింగ్).

Story first published: Thursday, February 22, 2024, 19:15 [IST]
Other articles published on Feb 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+