Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ముంబై ఇండియన్స్ పూర్తి షెడ్యూల్ ఇదే!

ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్‌‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు 21 మ్యాచ్‌ల వివరాలనే ప్రకటించిన బీసీసీఐ.. సోమవారం మిగతా 53 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను వెల్లడించింది.

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నా.. మొత్తం 74 ఐపీఎల్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరుగుతాయని స్పష్టం చేసింది. మే 26న చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగుస్తుందని తెలిపింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 21, 22న క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2 జరగనుండగా.. మే 24న చెన్నై వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది.

IPL 2024 Mumbai Indians Full Schedule Time Table Timings Dates Venues Details

ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను మే 17న ముంబై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. మొత్తం 14 లీగ్ మ్యాచ్‌ల్లో 7 సొంత మైదానంలో మరో 7 మ్యాచ్‌ల ఇతర జట్ల మైదానాల్లో ఆడనుంది. ఏప్రిల్ 14న ముంబైలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. ఆ రోజు ముంబై ఇండియన్స్ చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.

ముంబై ఇండియన్స్ పూర్తి షెడ్యూల్

మ్యాచ్-1: మార్చి 24, గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, అహ్మదాబాద్( రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-2: మార్చి 24, సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్, హైదరాబాద్( రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-3: ఏప్రిల్ 1, ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, ముంబై( రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-4: ఏప్రిల్ 7, ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై(మధ్యాహ్నం 3.30 గంటలకు)

మ్యాచ్-5: ఏప్రిల్ 11, ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్‌సీబీ, ముంబై (రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-6: ఏప్రిల్ 14, ముంబై ఇండియన్స్ వర్సెస్ సీఎస్‌కే, ముంబై (రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-7: ఏప్రిల్ 18, పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, మొహాలి( రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-8: ఏప్రిల్ 22, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, జైపూర్(రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-9: ఏప్రిల్ 27, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ(మధ్యాహ్నం 3.30 గంటలకు)

మ్యాచ్-10: ఏప్రిల్ 30, లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, లక్నో(రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-11: మే 3, ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్, ముంబై(రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-12: మే 6, ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై(రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-13: మే 11, కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్, కేకేఆర్(రాత్రి 7.30 గంటలకు)

మ్యాచ్-14: మే 17, ముంబై వర్సెస్ లక్నో, ముంబై(రాత్రి 7.30 గంటలకు)

ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు:
గెరాల్డ్ కోయిట్జీ, దిల్షాన్ మధుషంక, శ్రేయస్ గోపాల్, నువాన్ తుషార్, నమాన్ ధిర్, అన్షుల్ కంబోజ్, మహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రేవిస్,సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, శామ్స్ ములాని, నేహాల్ వధేరా, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తీకేయ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జాసన్ బెహ్రెండార్ఫ్, రోమారియో షెఫర్డ్(ట్రేడింగ్), హార్దిక్ పాండ్యా(ట్రేడింగ్).

Story first published: Monday, March 25, 2024, 18:53 [IST]
Other articles published on Mar 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+