Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: అతనికి నో ఛాన్స్.. ముంబై ఇండియన్స్ తుది జట్టు‌లో ఆడే విదేశీ ఆటగాళ్లు ఎవరంటే..?

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ క్యాంప్‌ను కూడా ప్రారంభించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా , బౌలింగ్ కోచ్ లసిత్ మలింగా ఈ శిబిరంలో పాల్గొన్నారు. మరో వారం రోజుల్లో జట్టులోని ఆటగాళ్లంతా ప్రాక్టీస్ క్యాంప్‌లో చేరనున్నారు.

మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. మార్చి 24న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. లీగ్‌లోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్.. ఆరో టైటిల్‌పై కన్నేసింది.

IPL 2024 Mumbai Indians Four Overseas Players Who Will Play All Matches

ఈ సారి ఆ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే కెప్టెన్సీ మార్పుతో పాటు జట్టులో కీలక మార్పులు చేసింది. గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకొంది. ఆ వెంటనే అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. టీమ్ భవిష్యత్తును ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

అయితే ఈ నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ అభిమానులు సైతం ముంబైపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2024 వేలంలో ముంబై తెలివిగా వ్యవహరించింది. జట్టుకు భారంగా మారిన జోఫ్రా ఆర్చర్‌ను వదిలేసిన ముంబై అతని స్థానంలో సౌతాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీని తీసుకుంది.

హార్దిక్ కోసం కామెరూన్ గ్రీన్‌ను వదిలేసి ముంబై.. రోమారియో షెఫెర్డ్‌ను జట్టులోకి తెచ్చుకుంది. డెవాల్డ్ బ్రేవిస్, జాసన్ బెహ్రాండార్ఫ్‌, టీమ్ డేవిడ్‌లను కొనసాగించిన ఆ జట్టు.. శ్రీలంక స్పిన్నర్ నువాన్ తుషార్, పేసర్ దిల్షాన్ మధుషంక, మహమ్మద్ నబీలను కొనుగోలు చేసింది. దాంతో తుది జట్టులో ఆడే ఓవర్‌సీస్ ఆటగాళ్లు ఎవరా..? అనేది ఆసక్తికరంగా మారింది.

పేస్ ఆల్‌రౌండర్‌గా.. లోయరార్డర్ హిట్టర్‌గా టీమ్ డేవిడ్ ఆడటం ఖాయం. ఓవర్‌సీస్ పేసర్ కోటాలో గెరాల్డ్ కోయిట్జీ చోటుకు డోకా లేదు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా మహమ్మద్ నబీకి నువాన్ తుషార్‌‌తో పోటీ ఉండనుంది. ఎకస్‌ట్రా పేసర్‌గా రోమారియో షెఫెర్డ్, జాసన్ బెహ్రాండార్ఫ్, దిల్షాన్ మధుషంకలో ఒకరికి చోటు దక్కనుంది.

ఓవర్‌సీస్ కోటాలో బౌలర్లకే ప్రాధాన్యత దక్కనున్న నేపథ్యంలో బ్యాటర్ అయిన డెవాల్డ్ బ్రేవిస్ బేంచ్‌కే పరిమితం కానున్నాడు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టీమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, రోమారియో షెఫెర్డ్/జాసన్ బెహ్రాండార్ఫ్, గెరాల్డ్ కోయిట్జీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ నబీ/ నువాన్ తుషార్, పియూష్ చావ్లా

ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు:
గెరాల్డ్ కోయిట్జీ, దిల్షాన్ మధుషంక, శ్రేయస్ గోపాల్, నువాన్ తుషార్, నమాన్ ధిర్, అన్షుల్ కంబోజ్, మహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రేవిస్,సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, శామ్స్ ములాని, నేహాల్ వధేరా, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తీకేయ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జాసన్ బెహ్రెండార్ఫ్, రోమారియో షెఫర్డ్(ట్రేడింగ్), హార్దిక్ పాండ్యా(ట్రేడింగ్).

Story first published: Tuesday, March 12, 2024, 15:02 [IST]
Other articles published on Mar 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+