ముంబై ఇండియన్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే 250 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్న తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ ఈ ఫీట్ సాధించింది.
ఐపీఎల్ అరంగేట్ర సీజన్ నుంచి లీగ్‌లో కొనసాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల కంటే ముందే ముంబై ఇండియన్స్ ఈ ఫీట్ సాధించింది. 17 ఏళ్ల చరిత్రలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ గెలిచింది.

ఐదు టైటిళ్ల సాధించిన మరో జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ నిషేధంతో రెండు సీజన్లకు దూరంగా ఉండటంతో ముంబై ఇండియన్స్‌కు ఈ ఫీట్ దక్కింది. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ 17 ఏళ్ల పాటు ఆడి ఉంటే ఎప్పుడో ఈ ఫీట్ సాధించేది.
ఎందుకంటే ఆ జట్టు ఐదు టైటిళ్లతో పాటు అత్యధికసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. ఐపీఎల్ బెట్టింగ్ ఆరోపణల నేపథ్యంలో సీఎస్‌కే 2016, 2017 సీజన్లు ఆడలేదు.
అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో ముంబై ఇండియన్స్ టాప్‌లో ఉండగా.. ఆర్‌సీబీ(241), కేకేఆర్(239), పంజాబ్ కింగ్స్(235), చెన్నై సూపర్ కింగ్స్(228) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న 250వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. అయితే ట్రెంట్ బౌల్ట్ ధాటికి ముంబై ఇండియన్స్ టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ(0), నమన్ ధిర్(0), ఇంపాక్ట్ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు.
మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(16)ను బర్గర్ ఔట్ చేయడంతో ముంబై ఇండియన్స్ 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(0), తిలక్ వర్మ ఆచితూచి ఆడుతున్నారు.