Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ఆర్‌సీబీలోకి పాకిస్థాన్ మాజీ పేసర్!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2024 సీజన్‌లో పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ బరిలోకి దిగనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రికెట్‌ లీగ్‌గా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఆడేందుకు ప్రతీ ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. తమ కెరీర్‌లో కనీసం ఒక్కసారైనా ఐపీఎల్‌లో ఆడాలనే లక్ష్యంగా పెట్టుకుంటారు.

కొందరైతే ఐపీఎల్ కోసమే ప్రత్యేకంగా సన్నదమవుతుంటారు. ఇప్పుడు పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ కూడా ఐపీఎల్‌లో ఆడేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అరంగేట్ర సీజన్‌లో పాక్ ఆటగాళ్లు భాగమైనా.. ఆ తర్వాత ఇరుదేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాదీ ఆటగాళ్లు ఆడకుండా నిషేధం విధించారు.

IPL 2024: Mohammad Amir likely to join RCB for upcoming season

ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. ఈ క్రమంలో మహమ్మద్ అమీర్.. పాక్ ప్లేయర్‌గా కాకుండా బ్రిటన్ పౌరుడిగా ఐపీఎల్‌ ఆడేందుకు సన్నదమవుతున్నాడు.
ఈ ఏడాదిలోపే అమీర్‌కు బ్రిటన్ పౌరసత్వం వచ్చే అవకాశం ఉంది. 2016లో ఇంగ్లండ్‌ పౌరురాలు, తన ప్రేయసి నజ్రిస్‌ ఖాన్‌ను అమీర్ వివాహమాడాడు.

2020 నుంచి ఇంగ్లండ్‌లోనే నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అమీర్‌కు బ్రిటన్‌ పౌరసత్వం రానుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ సీజన్‌ 2024 ప్రారంభానికి కూడా దాదాపు పది నెలల సమయం ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఐపీఎల్ 2024 సీజన్‌లో అమీర్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అతన్ని తీసుకునే అవకాశాలున్నాయి. కోహ్లీతో అమీర్‌కు ఉన్న సత్సంబంధాలే అతన్ని ఆర్‌సీబీలోకి తీసుకుంటాయని మహమ్మద్ అమీర్ సన్నిహితులు తెలిపారు. ఐపీఎల్ 2024 ఆడే అవకాశంపై మహమ్మద్ అమీర్ స్పందిస్తూ.. అవకాశం ఉంటే బరిలోకి దిగుతానని తెలిపాడు.

'బ్రిటన్ పౌరసత్వం రావాలంటే మరో ఏడాది సమయం పట్టనుంది. అప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను. ఒక్కసారి పాస్‌పోర్ట్‌ లభిస్తే.. తప్పకుండా అన్నింటికి అందుబాటులో ఉంటా. అత్యుత్తమ అవకాశాల(ఐపీఎల్)ను వదులుకోను. అయితే, ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున మాత్రం క్రికెట్‌ ఆడను. పాక్ నుంచి నా అంతర్జాతీయ క్రికెట్‌ను ఇప్పటికే ఆడేశా'అని అమీర్‌ చెప్పుకొచ్చాడు.

పాక్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లు ఆడిన అమీర్.. 259 వికెట్లు తీశాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆరేళ్ల పాటు నిషేధానికి గురైన అమీర్.. మళ్లీ రీఎంట్రీ చేసినా ఎక్కువకాలం కొనసాగలేకపోయాడు. చివరిసారిగా 2020లో తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడాడు. అప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు. కేవలం ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు.

Story first published: Wednesday, July 5, 2023, 8:51 [IST]
Other articles published on Jul 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+