ఐపీఎల్ 2024 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోనీ చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది.
అయితే ఈ మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ ఆటగాళ్లకు ధోనీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెనుదిరగడం చర్చనీయాంశమైంది. ఆర్‌సీబీ ఆటగాళ్లు గెలుపు సంబరాల్లో మునిగి తేలగా.. కాసేపు ఎదురుచూసిన ధోనీ, ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. తనకు ఎదురుపడిన ఆర్‌సీబీ కోచింగ్ స్టాఫ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన ధోనీ.. వెనక్కి చూడకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు.

షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వలేదు..?
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జట్టు గెలవలేదనే కోపంతోనే క్రీడాస్ఫూర్తి మరిచి ధోనీ అలా ప్రవర్తించాడని కొందరంటే.. ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించలేదని బాధతోనే.. దు:ఖాన్ని ఆపుకోలేక వెళ్లి పోయాడని మరికొందరు కామెంట్ చేశారు.
ఇంకొందరు ఆర్‌సీబీ ఆటగాళ్ల అతి చూడలేకనే మైదానం వీడాడని అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ మాత్రం ధోనీని ఆర్‌సీబీ అవమానించిందన్నాడు. ధోనీ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సిద్దమైనా.. అతన్ని పట్టించుకోకుండా ఆర్‌సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారని తెలిపాడు.
ఆర్‌సీబీ ఆటగాళ్లు బాధపడుతారు..
కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన ధోనీ పట్ల ఆర్‌సీబీ ఆటగాళ్లు అలా వ్యవహరించాల్సింది కాదన్నాడు. అయితే ధోనీ రిటైర్మెంట్‌పై క్లారిటీ లేకపోవడంతోనే ఈ తప్పిదం జరిగిందని చెప్పాడు. ధోనీ వీడ్కోలు విషయం ముందే తెలుసుంటే ఆర్‌సీబీ ఆటగాళ్లు హుందాగా వ్యవహరించేవారేమోనని అభిప్రాయపడ్డాడు. కానీ ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అని తెలిస్తే ఆర్‌సీబీ ఆటగాళ్లు కచ్చితంగా బాధపడుతారని చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్ అనంతరం ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్ షోలో మాట్లాడుతూ మైకేల్ వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.'ఆర్‌సీబీకి అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ప్లే ఆఫ్స్ చేరితేనే ఆ జట్టు అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకోవడం నేను చూశాను. వాళ్లు ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అందుకే అలా రియాక్ట్ అవుతున్నారు.
అయితే ఆర్‌సీబీ ఆటగాళ్లు ధోనీకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అతన్ని అవమానించారు. సంబరాలు తర్వాత అయినా చేసుకోవచ్చు. కానీ ధోనీలాంటి దిగ్గజానికి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సింది. ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అయితే మాత్రం ఆర్‌సీబీ ఆటగాళ్లు తప్పకుండా పశ్చాత్తాపానికి గురవుతారు. ధోనీకి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందని బాధపడుతారు.'అని మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు.