Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs RR: రోహిత్ శర్మ చెత్త రికార్డు!

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ అయితన బ్యాటర్‌గా రోహిత్ శర్మ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో వాంఖడే మైదానం వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు.

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ డకౌటవ్వడం ఇది 17వ సారి. ఈ క్రమంలో అతను ఆర్‌సీబీ వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్‌ చెత్త రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ తర్వాత గ్లేన్ మ్యాక్స్‌వెల్( 15), పియూష్ చావ్లా( 15), మన్‌దీప్ సింగ్(15), సునీల్ నరైన్(15) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

IPL 2024 MI vs RR Rohit Sharma makes an unwanted batting record in IPL with golden duck

ఈ మ్యాచ్‌లో పిచ్ నుంచి లభించిన అడ్వాంటేజ్‌ను చక్కగా ఉపయోగించుకున్న ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో రోహిత్ శర్మ(0), నమన్ ధిర్(0)లను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్(0)ను కూడా బౌల్ట్ గోల్డెన్ డక్ చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్ 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

ఈ పరిస్థితుల్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21 బంతుల్లో 6 ఫోర్లతో 34), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 సిక్స్‌లతో 32) 56 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. దాంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది. ట్రెంట్ బౌల్ట్(3/22), యుజ్వేంద్ర చాహల్(3/11) ముంబై పతనాన్ని శాసించారు. నండ్రే బర్గర్ రెండు, ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ తీసారు.

Story first published: Monday, April 1, 2024, 22:16 [IST]
Other articles published on Apr 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+