For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: ఎంతకు తెగించార్రా.. మయాంక్ యాదవ్‌పై భారీ కుట్ర!

లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్‌పై కొందరు అభిమానులు భారీ కుట్రకు తెరలేపారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్‌గా మారిన అతన్ని అసత్య ప్రచారాలతో డీఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. కళ్లు చెదిరే బౌలింగ్‌తో తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌తో మూడు వికెట్లు తీసి లక్నో విజయంలో కీలక పాత్ర షోషించిన మయాంక్ యాదవ్.. ఆర్‌సీబీతో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ మరో మూడు వికెట్లతో సత్తా చాటాడు. అంతేకాకుండా అత్యంత వేగమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. గంటకు 156.7 మీటర్ల వేగంతో నిలకడగా బంతులు సంధిస్తున్నాడు.

IPL 2024 Mayank Yadav Role Model Is Haris Rauf Real Or Fake

ఐపీఎల్ చరిత్రలోనే మూడు సార్లు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన తొలి పేసర్‌గా చరిత్రకెక్కాడు. వేగంతో పాటు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ వికెట్లు సాధిస్తున్నాడు. బౌలింగ్‌లోనూ వేరియేషన్స్ చూపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ స్టీవ్ స్మిత్ అయితే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతన్ని ఎంపిక చేయాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

ఆ సిరీస్‌లో మయాంక్ యాదవ్ పేస్‌ను ఎదుర్కోంటానని, అతని బౌలింగ్ ఆడాలని ఉందని తెలిపాడు. భారీ ధర పలికిన మిచెల్ స్టార్క్ కంటే మయాంక్ యాదవ్ ఎన్నో రెట్లు ఉత్తమమని ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు. సెహ్వాగ్, గవాస్కర్ వంటి దిగ్గజాలు మయాంక్ యాదవ్‌ను టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇలా అందరి ప్రశంసలు అందుకున్న మయాంక్ యాదవ్‌పై అసత్య ప్రచారంతో అతని ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అతను అనని మాటలను అన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. తన సంచలన ప్రదర్శన స్పందించిన మయాంక్ యాదవ్.. తన రోల్ మోడల్ పాకిస్థాన్ పేసర్ హ్యారీస్ రౌఫ్ అని తెలిపినట్లు అసత్య ప్రచారానికి తెరలేపారు.

వాస్తవానికి అతను ఏ ఇంటర్వ్యూలోనూ పలాన ఆటగాడు తన రోల్ మోడల్ అని చెప్పలేదు. తన తల్లిదండ్రులే తన రోల్ మోడలని పేర్కొన్నాడు. కానీ కొందరు ఆకతాయిలు పనిగట్టుకొని మయాంక్ యాదవ్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారు. బట్ట కాల్చి మీదేసి అతని కెరీర్‌ను దెబ్బతీసే కుట్రకు తెరలేపారు. క్రమశిక్షణతో కూడిన ఆహారం, వ్యాయామంతోనే తాను వేగంగా బంతులు సంధించగలుగుతున్నానని, భారత్‌కు ప్రాతినిథ్యం వహించడమే తన లక్ష్యమని మయాంక్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, April 4, 2024, 20:14 [IST]
Other articles published on Apr 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+