Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH ఆటగాళ్లను కలిసిన టాలీవుడ్ టాప్ హీరో.. ఫొటోలు వైరల్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిసాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మయాంక్ అగర్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ‌లు మహేశ్ బాబుతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. ఓ యాడ్ షూట్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మహేశ్ బాబును కలిసినట్లు తెలుస్తోంది.

IPL 2024 Mahesh Babu Meets Sunrisers Hyderabad Players

'టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబును కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది.'అని ప్యాట్ కమిన్స్ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్‌కు మహేశ్ బాబు బదులిచ్చాడు. కమిన్స్‌కు పెద్ద అభిమానినని తెలిపిన మహేశ్ బాబు.. కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ ఫొటోలను చూసి మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు టీమ్‌కు తెలుగు సూపర్ స్టార్ మద్దతు ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.

'గుంటూరు కారం'తో ప్రేక్షకులను అలరించిన మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెరెకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డు స్కోర్లు నమోదు చేస్తూ ఐపీఎల్ చరిత్రను తిరగరాస్తోంది.

ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌, హెన్రిచ్ క్లాసెన్‌లు భీక‌ర ఫామ్‌లో ఉండుగా.. బౌలర్లు భువ‌నేశ్వ‌ర్ కుమార్, న‌ట‌రాజ‌న్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిప్పులు చెరుగుతుండటంతో ఆరెంజ్ ఆర్మీకి ఎదురే లేకుండా పోయింది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ 5 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో టాప్-3లో కొనసాగుతోంది.

ఏప్రిల్ 25న ఉప్పల్ మైదానం వేదికగా జ‌రిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో తలపడనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ సంచలన విజయాన్ని అందుకుంది. 287 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. మ‌రోసారి అదే తరహా ప్రదర్శన కనబర్చడంపై ఫోకస్ పెట్టింది.

Story first published: Monday, April 22, 2024, 21:02 [IST]
Other articles published on Apr 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+