LSG Playing XI: ఐపీఎల్‌లోకి అడుగుపెడుతూనే సంచలనం సృష్టించిన నయా ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్.. గత రెండేళ్లుగా ఊరిస్తున్న టైటిల్‌పై కన్నేసింది. వరుసగా రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరిన ఆ జట్టు.. అదృష్టం కలిసిరాక ఫైనల్ చేరలేకపోయింది. గత సీజన్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో జట్టుకు దూరమవ్వడం విజయవకాశాలను దెబ్బతీసింది.
ఈ క్రమంలోనే అప్‌కమింగ్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ పకడ్బందీగా ప్రిపేర్ అవుతోంది. కోచ్, మెంటార్‌ను మార్చిన లక్నో.. దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను తీసుకొంది. భారత యువ పేసర్ శివమ్ మావి కోసం రూ.6.40 కోట్లు ఖర్చు చేసిన లక్నో.. యువ ప్లేయర్ ఎమ్ సిద్దార్థ్‌ను రూ. 2.40 కోట్లకు తీసుకుంది.

ఇంగ్లండ్ వెటరన్ పేసర్ డేవిడ్ విల్లేను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. కోర్‌టీమ్ మొత్తాన్ని రిటైన్ చేసుకున్న లక్నో బ్యాకప్ ప్లేయర్లను మాత్రమే వేలంలో కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ పర్యవేక్షణలో ఐపీఎల్ 2024 ఆడనుంది. ఇక పేపర్ మీద టీమ్ కాంబినేషన్ అంతా బాగానే కనిపిస్తున్నా.. అసలు సమరంలో ఎంతవరకు సత్తా చూపిస్తుందో చూడాలి..!
టీమ్ కాంబినేషన్..:
గాయంతో గత సీజన్ మధ్యలోనే తప్పుకున్న కేఎల్ రాహుల్.. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం అతను టీమిండియాలో మిడిలార్డర్‌లో ఆడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున రాహుల్ ఓపెనింగ్ చేస్తాడా? లేదా? అనేది ప్రశ్నగా మారింది. అతను ఓపెనర్‌గా బరిలోకి దిగితే క్వింటన్ డికాక్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. లేకుంటే రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడింగ్ చేసుకున్న దేవదత్ పడిక్కల్ ఓపెనింగ్ చేస్తాడు. అప్పుడు కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో ఆడుతాడు.
నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినీస్, దీపక్ హుడా మిడిలార్డర్‌లో ఆడనుండగా.. శివమ్ మావి, మార్క్ వుడ్, మోహ్‌సిన్ ఖాన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. రవి బిష్ణోయ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బరిలోకి దిగనున్నాడు. దీపక్ హుడాకు యువ ప్లేయర్ ఆయూష్ బదోని నుంచి పోటీ ఎదురవ్వనుండగా.. మోహ్‌సిన్ ఖాన్‌కు యాశ్ ఠాకూర్‌తో పోటీ నెలకొంది.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు(అంచనా)
కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్, దేవదత్ పడిక్కల్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినీస్, దీపక్ హుడా, శివమ్ మావి, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, మోహ్‌సిన్ ఖాన్/యశ్ ఠాకూర్
వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు
అర్షిణి కులకర్ణి(రూ. 20 లక్షలు), శివమ్ మావి(రూ. 6.40 కోట్లు), ఎమ్ సిద్దార్థ్(రూ. 2.40 కోట్లు), అష్టన్ టర్నర్(రూ. కోటి), డేవిడ్ విల్లే(రూ. 2 కోట్లు), మహమ్మద్ అర్షద్ ఖాన్(రూ.20 లక్షలు)
లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి జట్టు:
క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, దేవదత్ పడిక్కల్, ఆయూష్ బదోని, అష్టన్ టర్నర్, దీపక్ హుడా, గౌతమ్, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినీస్, ప్రేరక్ మన్కడ్, యుధ్‌వీర్ సింగ్ చరక్, డేవిడ్ విల్లే, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, మార్క్ వుడ్, మాయంక్ యాదవ్, మోహ్‌సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్, శివమ్ మావి, మణిమరన్ సిద్దార్థ్.