Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ సంచలన నిర్ణయం.. ఆ ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు గుడ్‌బై!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) విఫలమైంది. గతేడాదే టోర్నీలోకి అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ అద్బుత ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరినా.. ఆర్‌సీబీతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సారి కూడా ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది.

కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమవడం.. యువ ఆటగాళ్ల వైఫల్యం.. కీలక సమయంలో స్టార్ ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం లక్నో సూపర్ జెయింట్స్ టైటిల్ అకాశాలను దెబ్బతీసింది. 14 మ్యాచ్‌ల్లో 8 గెలిచిన లక్నో మూడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్ వైఫల్యం నేపథ్యంలో జట్టును పటిష్టం చేయడంపై లక్నో ఫోకస్ పెట్టింది.

LSG will release these foreign players before next season

ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే జట్టుకు అవసరం లేని ఆటగాళ్లతో ఓ జాబితాను సిద్దం చేసింది. ఇందులో నుంచి ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతోంది.

1. నవీన్ ఉల్ హక్: ఐపీఎల్ 2023 సీజన్‌లో నవీన్ ఉల్ హక్ అద్భుత ప్రదర్శనే చేసినప్పటికీ.. విరాట్ కోహ్లీతో పెట్టుకున్న గొడవ లక్నో ఫ్రాంచైజీ ప్రతిష్టకు భంగం కలిగించింది. అభిమానులంతా నవీన్ ఉల్ హక్ vs విరాట్ కోహ్లీ గొడవగా కాకుండా.. ఆర్‌సీబీX లక్నో మధ్య మాటల పోరుగా భావిస్తున్నారు.

లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ కూడా ఈ గొడవకు ఆజ్యం పోయడంతో.. ఆ ఫ్రాంచైజీని అభిమానించేవారి కంటే ద్వేషించే వారి సంఖ్యనే ఎక్కువైంది. ఇది టీమ్ భవిష్యత్తుపై ప్రభావం చూపనుందని గ్రహించిన మేనేజ్‌మెంట్ దిద్దుబాటు చర్యలకు దిగింది.

LSG will release these foreign players before next season

ఈ క్రమంలోనే నవీన్ ఉల్ హక్‌ను వదులుకోవడంతో పాటు గంభీర్‌ను కూడా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక ఐపీఎల్ 2023 సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన నవీన్ ఉల్ హక్ 11 వికెట్లు తీసాడు.

LSG will release these foreign players before next season

2. కైల్ మేయర్స్: ఐపీఎల్ 2023 సీజన్ ఫస్టాఫ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన కైల్ మేయర్స్.. కీలక మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం 13 మ్యాచ్‌ల్లో 4 హాఫ్ సెంచరీలతో 379 పరుగులు చేశాడు. కైల్ మేయర్స్ కారణంగా క్వింటన్ డికాకును బెంచ్‌కు పరిమితం చేసిన లక్నో మూల్యం చెల్లించుకుంది. ఈ క్రమంలోనే కైల్ మేయర్స్‌ను వదులుకునేందుకు సిద్దమవుతోంది.

romario shepherd lucknow

3. రొమారియో షెఫెర్డ్: బ్యాకప్ ప్లేయర్‌గా తీసుకున్న రొమారియో షెఫెర్డ్‌ను కూడా లక్నో వదులుకునేందుకు సిద్దమవుతోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన రొమారియో‌కు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం కూడా దక్కలేదు. ఇతర లీగ్‌లతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ రొమారియో విఫలమవుతుండటంతో అతనికి గుడ్‌బై చెప్పేందుకు లక్నో సిద్దమవుతోంది.

Story first published: Thursday, July 13, 2023, 16:38 [IST]
Other articles published on Jul 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+