For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: అతని కోసం ఆవేశ్ ఖాన్‌ను వదులుకున్న లక్నో సూపర్ జెయింట్స్!

IPL 2024, LSG trade Avesh Khan: ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల ట్రేడింగ్ విండో ద్వారా రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన దేవదత్ పడిక్కల్‌ను జట్టులోకి తెచ్చుకుంది. అతని కోసం స్టార్ పేసర్ ఆవేశ్ ఖాన్‌ను వదులుకుంది. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

తమ ఫ్రాంచైజీ చెందిన ఎక్స్ ఖాతాలో పడిక్కల్‌కు స్వాగతం చెప్పిన లక్నో సూపర్ జెయింట్స్.. ఆవేశ్‌ ఖాన్‌కు వీడ్కోలు పలుకుతూ ఆల్‌ది బెస్ట్ చెప్పింది. వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐపీఎల్ 2024 సీజన్ నిర్వహణపై ఫోకస్ పెట్టింది. డిసెంబర్ రెండో వారంలో దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

IPL 2024: LSG trade Avesh Khan for Rajasthan Royals Devdutt Padikkal ahead of Upcoming Season

ఇప్పటికే ట్రేడింగ్ విండో ఓపెన్ చేసిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను అందజేయాలని ఫ్రాంచైజీలను ఆదేశించింది. ఈ జాబితాలను సమర్పించేందుకు నవంబర్ 26 డెడ్‌లైన్‌గా విధించింది. ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడింగ్ విండో ద్వారా స్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్‌ను ముంబై ఫ్రాంచైజీకి ఇచ్చేసింది.

ఐపీఎల్ 2024 వేలానికి పకడ్బందీగా సిద్దమవుతున్న లక్నో సూపర్ జెయింట్స్.. టీమ్ మెంటార్‌ను కూడా వదులుకుంది. గత రెండు సీజన్లుగా టీమ్ మెంటార్‌గా సేవలందించిన గౌతమ్ గంభీర్‌ను వదులుకుంది. అతను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు మెంటార్‌గా సేవలందించేందుకు సిద్దమవ్వగా.. లక్నో సూపర్ జెయింట్స్ తమ తదుపరి మెంటార్ ఎవరు అనే విషయాన్ని వెల్లడించలేదు. భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌‌ను టీమ్ వ్యూహకర్త కన్సల్టెంట్‌గా నియమించుకుంది.

గత సీజన్ ముగియగానే హెడ్ కోచ్‌ను కూడా లక్నో సూపర్ జెయింట్స్ మార్చేసింది. ఆండీ ఫ్లవర్‌కు వీడ్కోలు పలికిన ఆ జట్టు.. ఆసీస్ దిగ్గజ ప్లేయర్ జస్టిన్ లాంగర్‌ను కొత్త కోచ్‌గా నియమించుకుంది. ఐపీఎల్ 2024 సీజన్ విదేశాల్లో జరిగే అవకాశం ఉంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు సెక్యూరిటీ కల్పించడం సమస్యగా మారనుంది.

Story first published: Wednesday, November 22, 2023, 18:40 [IST]
Other articles published on Nov 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+