For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs LSG: సంజీవ్ గోయెంకా.. సీఎస్‌కే ఓనర్స్‌ను చూసి నేర్చుకో! ఫ్యాన్స్ ఫైర్!

లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ పట్ల గోయెంకా వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నారు. దాంతో అతని పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తయ్యింది.

ముందుగా బ్యాటింగ్‌లో తడబడిన లక్నో సూపర్ జెయింట్స్.. అనంతరం బౌలింగ్‌లో తేలిపోయింది. 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే చేధించింది. ఆ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంకర బ్యాటింగ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగారు. అయితే ఈ ఘోర పరాజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

IPL 2024 LSG owner Sanjeev Goenka gets bashed by fans as they should learn from csk

రాహుల్‌పై అరిచిన గోయెంకా..
ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు హాజరైన అతను.. ఈ ఓటమిని తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్‌తో సంజీవ్ గోయెంకా సీరియస్‌గా చర్చించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ ఓటమికి కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను బాధ్యుడిని చేస్తూ గోయెంకా క్లాస్ పీకినట్లు ఈ వీడియోను చూస్తే అర్థమవుతోంది.

మ్యాచ్ పరిస్థితిని కేఎల్ రాహుల్ వివరించే ప్రయత్నం చేసినా సంజీవ్ గోయెంకా వినిపించుకోలేదు. కోపంతో ఊగిపోయారు. వారి మధ్య జరిగిన సంభాషణపై స్పష్టత లేనప్పటికీ సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.

ధోనీకి ఘోర అవమానం..
గతంలో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ పట్ల కూడా గోయెంకా ఇలానే ప్రవర్తించాడు. ధోనీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి తీవ్రంగా అవమానించాడు. ఈ క్రమంలోనే గోయెంకా తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటగాళ్ల పట్ల ఎలా ఉండాలో సీఎస్‌కే ఓనర్స్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

సీఎస్‌కే మేనేజ్‌మెంట్ గురించి మొయిన్ అలీ మాట్లాడిన ఓ వీడియోను షేర్ చేస్తూ సంజీవ్ గోయెంకాపై విమర్శలు గుప్పిస్తున్నారు.'చెన్నై జట్టులోకి వచ్చి నేను మూడేళ్లు అయ్యింది. ఈ మూడేళ్లలో టీమ్ ఓనర్‌ను ఒకేసారి కలిసాను. అది కూడా మూడో ఏడాదే. సీఎస్‌కే జట్టులో ఎలాంటి సమస్య లేదు. మేం బాగా ఆడకపోయినా ఓనర్స్ ఎలాంటి ప్రశ్నలు అడగరు.

ఈ సీజన్‌లో రాణించకపోవతే వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శన చేసేలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు. ఏనాడు కూడా ఏ ఆటగాడిని ఇబ్బంది పెట్టలేదు. ఆటగాళ్లందరినీ ఒక కుటుంబంలా చూస్తారు.'అని మొయిన్ అలీ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, May 9, 2024, 14:09 [IST]
Other articles published on May 9, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+