Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. బౌలింగ్ కోచ్‌‌‌గా దిగ్గజ పేసర్!

హైదరాబాద్: ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గత సీజన్‌ వరకు పేస్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించిన షేన్ బాండ్‌పై వేటు వేసింది. అతని స్థానంలో శ్రీలంక దిగ్గజ పేసర్, ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగాను నియమించింది. అయితే ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌ఇన్‌ఫో కథనం ప్రకారం ముంబై ఇండియన్స్ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన లసిత్ మలింగా 2021లో ఫ్రాంచైజీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు.

IPL 2024: Lasith Malinga replaces Shane Bond as Mumbai Indians fast-bowling coach for upcoming season

2018లో ముంబై ఇండియన్స్ మెంటార్‌గా మలింగా పనిచేశాడు. అనంతరం మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చిన మలింగా జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి ముంబై ఇండియన్స్ పేస్ బాధ్యతలను పంచుకున్నాడు. 2019లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముంబై ఇండియన్స్ నాలుగు ఐపీఎల్ టైటిల్స్(2013, 2015, 2017. 2019) గెలవడంలో మలింగా కీలక పాత్ర పోషించాడు.

2011 ఛాంపియన్స్ లీగ్ గెలిచిన జట్టులోనూ మలింగా సభ్యుడిగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున 139 మ్యాచ్‌లు ఆడిన మలింగా 7.12 ఎకానమీతో 195 వికెట్లు తీసాడు. ఐపీఎల్‌లో 170 వికెట్లు పడగొట్టాడు.

2015లో ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి షేన్ బాండ్.. గత సీజన్ వరకు బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఈ ఏడాది ఐఎల్‌టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ టీమ్‌కు అతను హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు.

ఐపీఎల్ 2024 సీజన్ కోసం అన్నీ ఫ్రాంచైజీలు ప్రణాళికలు ప్రారంభించాయి. తమ జట్లలో కీలక మార్పులు చేస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ హెడ్ కోచ్‌లను మార్చాయి. ఆండీ ఫ్లవర్‌ను తప్పించి జస్టిన్ లాంగర్‌ను లక్నో తమ హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఇక ఆర్‌సీబీ మైక్ హస్సెన్‌పై వేటు వేసి ఆండీ ఫ్లవర్‌ను కొత్త కోచ్‌గా ఎంచుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్రియాన్ లారాను తప్పించి డానియల్ వెటోరిని నియమించుకుంది. ఇతర ఫ్రాంచైజీలు సైతం ఐపీఎల్ 2024 కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి.

Story first published: Saturday, August 19, 2023, 19:23 [IST]
Other articles published on Aug 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+