KKR playing XI: ఐపీఎల్ 2024 టైటిల్‌పై కన్నేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. అందుకు తగ్గట్లుగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దుబాయ్ వేదికగా డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో రికార్డు ధర చెల్లించి ఆస్ట్రేలియా పేస్ ఆల్‌రౌండర్ మిచెల్ స్టార్క్‌ను తీసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్.. అందరి దృష్టిని ఆకర్షించింది.
గత 16 సీజన్లలో (2012, 2014) రెండు సార్లు మాత్రమే టైటిల్ అందుకున్న ఆ జట్టు.. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. గతేడాది పేలవ ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే టీమ్ బలహీనతలపై ఫోకస్ పెట్టిన కేకేఆర్.. వేలంలో కత్తిలాంటి ఆటగాళ్లను తీసుకుంది.

గాయంతో గత సీజన్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రాగా.. తమను ఛాంపియన్‌గా నిలబెట్టిన మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా బాధ్యతలు స్వీకరించాడు. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ కోల్‌కతా జట్టులో చేరాడు. దాంతో కేకేఆర్‌పై అంచనాలు పెరిగాయి. వేలంలోనే గంభీర్ మార్క్ కనిపించింది. మిచెల్ స్టార్క్‌ను రూ. 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం.. మనీశ్ పాండేను రూ. 50 లక్షలకు తీసుకోవడం వెనుక గంభీర్ ఉన్నాడు.
ఆన్‌పేపర్‌పై పటిష్టంగా కనిపిస్తున్న కేకేఆర్.. జట్టులోని ఆటగాళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే సునాయసంగా ప్లే ఆఫ్స్ చేరుతుంది. కానీ గత కొన్ని సీజన్లుగా విఫలమవుతున్న ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, చేతన్ సకారియాల ప్రదర్శనపై సందేహం నెలకొంది. రింకూ సింగ్ రూపంలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే హిట్టర్ ఆ జట్టుకు ఉన్నాడు.
టీమ్ కాంబినేషన్..:
ఓపెనర్లుగా అఫ్గాన్ వికెట్ కీపర్ రెహ్మనుల్లా గుర్బాజ్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. జాసన్ రాయ్‌ను పరిగణలోకి తీసుకుంటే మాత్రం రెహ్మనుల్లా గుర్బాజ్ బెంచ్‌కు పరిమితమవుతాడు. అప్పుడు వికెట్ కీపర్ అయిన కేఎస్ భరత్‌కు తుది జట్టులో చోటివ్వాల్సి ఉంటుంది. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, నితీశ్ ఱానా, రింకూ సింగ్ ఆడనున్నారు.
ఆల్‌రౌండర్లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్‌లు బరిలోకి దిగనున్నారు. పేసర్లుగా చేతన్ సకారియా, వైభవ్ అరోరా ఆడనుండగా.. వరుణ్ చక్రవర్తీ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అవకాశాన్ని అందుకోనున్నాడు. సుయాశ్ శర్మ, గస్ అట్కిన్సన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ బ్యాకప్ బౌలర్లుగా ఉండనున్నారు.

కేకేఆర్ తుది జట్టు(అంచనా):
రెహ్మనుల్లా గుర్బాజ్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తీ, వైభవ్ అరోరా
కేకేఆర్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
చేతన్ సకారియా(రూ. 50 లక్షలు), మిచెల్ స్టార్క్(రూ. 24.75 కోట్లు), కేఎస్ భరత్(రూ. 50 లక్షలు), అంగిక్రిష్ రఘు వంశీ(రూ. 20 లక్షలు), షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్( రూ. 1.50 కోట్లు), రమణ్‌దీప్ సింగ్(రూ. 20 లక్షలు), మనీశ్ పాండే( రూ. 50 లక్షలు), అట్కిన్సన్(రూ. కోటి), సాకిబ్ హుస్సెన్( రూ. 20 లక్షలు)
కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు:
జాసన్ రాయ్, రహ్మతుల్లా గుర్బాజ్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ, కేఎస్ భరత్, మనీష్ పాండే, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, నితిశ్ రాణా, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, ముజీబ్ రెహ్మాన్, గస్ అట్కిన్సన్, షకీబ్ హుస్సేన్.