ఐపీఎల్ 2024 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి 4 బంతుల్లో 6 పరుగులు చేయలేక ఓటమికి తల వంచింది. హెన్రీచ్ క్లాసెన్(29 బంతుల్లో 8 సిక్స్‌లతో 63) ఒంటరి పోరాటం వృథా అయ్యింది.
క్లాసెన్ సంచలన బ్యాటింగ్‌తో చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 13 పరుగులు అవసరమవ్వగా.. సన్‌రైజర్స్ 8 పరుగులు మాత్రమే చేసింది. హర్షిత్ రాణా కట్టడిగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆండ్రూ రస్సెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 నాటౌట్), ఫిల్ సాల్ట్(40 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ మూడు వికెట్లు తీయగా.. మార్కండే రెండు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులే చేసి ఓటమిపాలైంది. హెన్రీచ్ క్లాసెన్‌తో పాటు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(21 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32), అభిషేక్ శర్మ(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) రాణించారు.
అదిరిపోయే ఆరంభం..
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు చేసిన ఈ జోడీ తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించింది. దూకుడుగా ఆడుతున్న మయాంక్ అగర్వాల్‌ను హర్షిత్ రాణా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది.
ఆ కొద్ది సేపటికే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(32)ను ఆండ్రీ రస్సెల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన మార్క్‌రమ్ సాయంతో రాహుల్ త్రిపాఠి జట్టు స్కోర్‌ను 100 పరుగులు ధాటించాడు. త్రిపాఠి పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమవడంతో ఒత్తిడికి గురైన మార్క్‌రమ్.. వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే రాహుల్ త్రిపాఠిని సునీల్ నరైన్ ఔట్ చేయగా.. అబ్దుల్ సమద్‌ను రస్సెల్ పెవిలియన్ చేర్చాడు. మరోవైపు హెన్రీచ్ క్లాసెన్ భారీ సిక్సర్లతో ఒంటరి పోరాటం చేశాడు.
క్లాసెన్ ఊరమాస్ బ్యాటింగ్..
వరుణ్ చక్రవర్తీ వేసిన 18వ ఓవర్‌లో క్లాసెన్ రెండు సిక్స్‌లు బాదగా.. షెహ్‌బాజ్ అహ్మద్ ఓ సిక్సర్ కొట్టాడు. దాంతో ఈ ఓవర్‌లో 21 పరుగులు వచ్చాయి. మిచెల్ స్టార్క్ వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాదిన హెన్రీచ్ క్లాసెన్.. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి బంతిని షెహ్‌బాజ్ అహ్మద్ సిక్స్‌కు తరలించడంతో ఈ ఓవర్‌లో 26 పరుగులు వచ్చాయి. దాంతో సన్‌రైజర్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమయ్యాయి.
చివరి ఓవర్ తొలి బంతికి క్లాసెన్ సిక్స్ బాదగా.. మూడో బంతికి షెహ్‌బాజ్ అహ్మద్ క్యాచ్ ఔటయ్యాడు. మరుసటి బంతి సింగిల్ రాగా.. ఐదో బంతికి క్లాసెన్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ విజయానికి ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. కానీ డాట్ బాల్ అవ్వడంతో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది.