ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చాడు. కుడి తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న అతను పూర్తిగా కోలుకున్నాడు. దాంతో ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న రాహుల్.. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు. ఎన్‌సీఏ మెడికల్ టీమ్ పెట్టిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో అతను పాసయ్యాడు. దాంతో అతనికి ఐపీఎల్ ఆడే అనుమతి లభించింది. అయితే ఆరంభ మ్యాచ్‌ల్లో అతను వికెట్ కీపింగ్ చేయవద్దని, కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే జట్టులో కొనసాగాలని సూచించింది.

ఆ ఒక్కటి తప్పా..
వికెట్ కీపింగ్ చేస్తే గాయం మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందని హెచ్చరించింది. 'కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. మరో రెండో రోజుల్లో అతను లక్నో ఫ్రాంచైజీతో కలవనున్నాడు. అతను తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఇంజెక్షన్ల సాయంతో ఆటను కొనసాగించాడు. అనంతరం ఎన్‌సీఏలో చేరి రిహాబిలిటేషన్ తీసుకున్నాడు.
ప్రస్తుతం అతను ఫిట్‌గా ఉన్నాడని ఎన్‌సీఏ డిక్లేర్ చేసింది. కొద్ది రోజుల వరకు కీపింగ్ చేయవద్దని సూచించింది.'అని ఓ అధికారి మీడియాకు తెలిపారు.
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ టెస్ట్‌లో తొడ కండరాల్లో నొప్పి ఉన్నట్లు రాహుల్.. ఫిజియోలకు ఫిర్యాదు చేశాడు. దాంతో అతన్ని సిరీస్ నుంచి తప్పించి ఎన్‌సీఏకు పంపించారు.
ఐపీఎల్‌కు ముందు..
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంగ్లండ్‌తో చివరి నాలుగు టెస్ట్‌లకు రాహుల్ దూరమయ్యాడు. దాంతో ఐపీఎల్ 2024 సీజన్ ఆడటం కూడా కష్టమేననే అభిప్రాయం వ్యక్తమైంది. చివరి టెస్ట్‌కు ముందు 90 శాతం ఫిట్‌నెస్ సాధించినా.. బీసీసీఐ అతన్ని ఆడించే ప్రయత్నం చేయలేదు. ఎక్స్‌పర్ట్ ఓపినియన్ కోసం ఇంగ్లండ్ పంపించింది.
ఇక కేఎల్ రాహుల్‌తో పాటు వెన్ను నొప్పితో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్‌కు కూడా ఐపీఎల్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రంజీ ట్రోఫీ ఫైనల్లో అయ్యర్‌కు వెన్ను నొప్పి తిరగబెట్టింది. దాంతో అతని చివరి రెండు రోజులు మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఎన్‌సీఏలో చేరి చికిత్స తీసుకున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో అతను కేకేఆర్ జట్టుతో కలిసాడు.
మార్చి 22న ఐపీఎల్ 2024 సీజన్‌కు తెరలేవనుండగా.. మార్చి 24న రాజస్థాన్ రాయల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.