Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ‘బాల్ ఆఫ్ ది ఐపీఎల్’..రూ. 24.75 కోట్ల ఆటగాడా? మజాకా!(వీడియో)

కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. మరోసారి తన బౌలింగ్‌తో బిగ్ మ్యాచ్‌ ప్లేయర్ అనిపించుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఫైనల్లో మిచెల్ స్టార్క్ సత్తా చాటాడు. తొలి మూడు ఓవర్లలో రెండు వికెట్లు తీసి ఆరెంజ్ ఆర్మీని కోలుకోలేని దెబ్బతీసాడు.

వేలంలో తననురూ. 24.75 కోట్ల రికార్డ్ ధరకు కేకేఆర్ ఎందుకు తీసుకుందో అందరికి అర్థమయ్యేలా తన బౌలింగ్‌తోనే వివరించాడు. సీజన్ మొత్తం విఫలమైన స్టార్క్.. కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం విన్నింగ్ పెర్ఫామెన్స్ చేసాడు.

IPL 2024 KKR s Rs 24 75 Crore Buy Mitchell Starc Produces Ball Of The IPL Video Goes Viral

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోనే జరిగిన క్వాలిఫయర్‌-1లోనూ నిప్పులు చెరిగి పవర్ ప్లేలోనే కీలక వికెట్లు పడగొట్టిన మిచెల్ స్టార్క్.. ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాడు. తొలి ఓవర్‌లోనే విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(2)ను పెవిలియన్ చేర్చిన స్టార్క్.. తన మూడో ఓవర్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠి(9) ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు.

స్టన్నింగ్ డెలివరీతో అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ చేసిన స్టార్క్.. రాహుల్ త్రిపాఠిని క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. స్టార్క్ స్టన్నింగ్ డెలివరీకి అభిషేక్ శర్మ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. 'బాల్ ఆఫ్ ది ఐపీఎల్' అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అతనికి తోడుగా ఇతర బౌలర్లు కూడా చెలరేగడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో సన్‌రైజర్స్ 90 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక అసాధారణ ప్రదర్శన కనబర్చిన మిచెల్ స్టార్క్‌పై ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారీ ధర దండుగ అంటూ విమర్శించిన వారే ఇప్పుడు అతన్ని శభాష్ అంటూ కొనియాడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పిచ్‌ను సరిగ్గా అర్థం చేసుకోకుండా బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో కేకేఆర్ బౌలర్లు నిప్పులు చెరిగారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(2), ట్రావిస్ హెడ్(0), రాహుల్ త్రిపాఠి(9), హెన్రీచ్ క్లాసెన్(16) ఎయిడెన్ మార్క్‌రమ్(20), నితీష్ కుమార్ రెడ్డి(13), షెహ్‌బాజ్ అహ్మద్(8), అబ్దుల్ సమద్(4) దారుణంగా విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Story first published: Sunday, May 26, 2024, 20:59 [IST]
Other articles published on May 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+