IPL 2024: ముద్దుల సరదా తీరింది.. కేకేఆర్ ఆటగాడిపై నిషేధం!
కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ పేసర్ హర్షిత్ రాణా ముద్దుల సరదా తీరింది. మైదానంలో అతని ఓవరాక్షన్‌పై ఐపీఎల్ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించడంతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ రాణా అతిగా ప్రవర్తించాడు. స్టన్నింగ్ డెలివరీతో అభిషేక్ పోరెల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి అతనికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చే ప్రయత్నం చేసిన హర్షిత్ రాణా.. ఐపీఎల్ రూల్స్ గుర్తొచ్చి డగౌట్ వైపు వెళ్లాలని సైగ చేశాడు. అయితే ఈ చర్యను తప్పుగా భావించిన మ్యాచ్ రిఫరీ అతనిపై రూల్స్ ప్రకారం చర్యలు తీసుకున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లోనూ హర్షిత్ రాణా ఇలానే సెలెబ్రేట్ చేసుకొని మందలింపుకు గురయ్యాడు. మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం అతని దగ్గరకు వెళ్లి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్న ఐపీఎల్ యాజమాన్యంపై అతని మ్యాచ్ ఫీజులో 60 శఆతం కోత విధించింది.

అయినా తన తప్పిదాన్ని మరోసారి రిపీట్ చేయడంతో రూల్స్ ప్రకారం ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. ఐపీఎల్ మేనేజ్‌మెంట్ చర్యలతో హర్షిత్ రాణాపై అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. ముద్దుల సరదా తీరిందా? మరోసారి ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications