Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: కేకేఆర్ సంచలన నిర్ణయం.. ఆ ముగ్గురు భారత ఆటగాళ్లకు గుడ్‌బై!

హైదరాబాద్: ఐపీఎల్ 2024 సీజన్‌ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ వైఫల్యం నేపథ్యంలో జట్టు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా ఇంటిదారిపట్టడంపై టీమ్ మేనేజ్‌మెంట్ ఆగ్రహంగా ఉంది.

మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు మాత్రమే నమోదు చేసిన కేకేఆర్ 12 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. రింకూ సింగ్ సెన్సేషనల్ బ్యాటింగ్ మినహా కేకేఆర్ అభిమానులకు సంతోషాన్నిచ్చే అంశం ఒక్కటి కూడా లేదు. కెప్టెన్‌గా నితీశ్ పర్వాలేదనిపించినా.. స్టార్ ఆటగాళ్ల వైఫల్యం జట్టు ఓటములకు కారణమైంది.

IPL 2024: KKR will release these Indian players before next season

ముఖ్యంగా ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, లిటన్ దాస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దాంతో కోల్‌కతా తరుచూ టీమ్ కాంబినేషన్‌ను మార్చింది. యవ ఆటగాళ్లు నారయణ్ జగదీషన్, మన్‌దీప్ సింగ్‌లు కూడా దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు ముగ్గురు భారత ఆటగాళ్లపై వేటు వేసేందుకు కేకేఆర్ సిద్దమైంది.

1.శ్రేయస్ అయ్యర్..:వెన్ను గాయంతో ఆటకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఇంకా కోలుకోకపోవడంతో అతన్ని వేలంలోకి వదిలేయాలని కేకేఆర్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అతని స్థానంలో మరో భారత ప్లేయర్‌ను తీసుకొవాలనుకుంటోంది. ఐపీఎల్ 2024 సీజన్‌కు అయ్యర్ అందుబాటులో ఉంటే మాత్రమే అతన్ని కొనసాగించనుంది.

2.మన్‌దీప్ సింగ్..:ఐపీఎల్ 2023 సీజన్‌లో మన్‌దీప్ సింగ్ దారుణంగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్‌ల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో తుది జట్టు నుంచి మన్‌దీప్ సింగ్‌ను కేకేఆర్ తప్పించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు అతన్ని కేకేఆర్ వదిలేసే అవకాశం ఉంది.

IPL 2024: KKR will release these Indian players before next season

3. నారయణ్ జగదీషన్..:దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నారయణ్ జగదీషన్.. ఐపీఎల్ 2023 సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో 89 పరుగులే మాత్రమే చేశాడు. అత్యధిక స్కోర్ 36 మాత్రమే. ఓపెనర్‌గా ఒక్క ఇన్నింగ్స్ కూడా సరిగ్గా ఆడని జగదీషన్‌ను వదులుకునేందుకు కేకేఆర్ సిద్దమైంది. ఇప్పటికే వదిలేసుకునే ఆటగాళ్లతో కేకేఆర్ ఓ జాబితాను సిద్దం చేసుకుంది.

Story first published: Monday, July 10, 2023, 18:20 [IST]
Other articles published on Jul 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+