Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs MI: బూమ్ బూమ్ బుమ్రా! ట్రేడ్ మార్క్ డెలివరీ.. సునీల్ నరైన్ గోల్డెన్ డక్!(వీడియో)

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కళ్లు చెదిరే బౌలింగ్‌తో ఔరా అనిపించాడు. స్టన్నింగ్ డెలివరీతో కేకేఆర్ విధ్వంసకర బ్యాటర్ సునీల్ నరైన్‌ను గోల్డెన్ డక్ చేశాడు. బుమ్రా అసాధారణ బంతికి సునీల్ నరైన్ బిత్తరపోయాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కేకేఆర్, ముంబై ఇండియన్స్ మధ్య ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

బుమ్రా వేసిన రెండో ఓవర్ తొలి బంతికే నరైన్ క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. ఈ బంతిని అంచనా వేయడంలో సునీల్ నరైన్ విఫలమయ్యాడు. బౌన్సర్ వేస్తాడని ఊహించిన అతను బంతిని వదిలేయగా.. బుమ్రా అప్పటికప్పుడు ప్లాన్ మార్చేసి ఇన్ స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో సునీల్ నరైన్(0) నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

IPL 2024 KKR vs MI Live Score Jasprit Bumrah Special Leaves Sunil Narine Clueless

ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బూమ్ బూమ్ బుమ్రా అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవ్వగా.. అంపైర్లు ఆటను 16 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

బుమ్రా స్టన్నింగ్ డెలివరీకి సునీల్ నరైన్ ఔటైతే.. ఫిల్ సాల్ట్‌ను నువాన్ తుషార్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడుతున్నారు. దాంతో 4 ఓవర్లలోనే కేకేఆర్ 40 పరుగులు చేసింది.

Story first published: Saturday, May 11, 2024, 22:00 [IST]
Other articles published on May 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+