Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 ఫైనల్‌కు కేకేఆర్.. షారూఖ్ ఖాన్‌కు గుండెపోటు!

బాలీవుడ్ బాద్ షా, కోల్‌కతా నైట్‌రైడర్స్ కో-ఓనర్ షారూఖ్ ఖాన్‌ గుండె పోటుకు గురైనట్లు తెలుస్తోంది. అతన్ని హుటా హుటిన అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుపత్రికి తరలించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బాద్ షా ఆసుపత్రి పాలయ్యాడనే వార్త.. అతని అభిమానులతో పాటు కేకేఆర్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు హాజరైన షారూఖ్ ఖాన్ తన జట్టుకు అండగా నిలిచాడు. విజయానంతరం మైదానం మొత్తం తిరుగుతూ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు.

IPL 2024 KKR s Owner Shah Rukh Khan hospitalized for heatstroke during Qualifier match vs SRH

కేకేఆర్ ఫైనల్ చేరడంతో తెగ సంతోషం వ్యక్తం చేశాడు. తన కూతురు, కొడుకుతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. గాడ్ ఆఫ్ ఆన్ ఇచ్చే క్రమంలో లైవ్‌లో మాట్లాడుతున్న సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రాలను పలకరించాడు. లైవ్‌లో ఉన్న విషయాన్ని గ్రహించి వారికి క్షమాపణలు కూడా చెప్పాడు.

కేకేఆర్ గెలిచిందనే సంతోషం ఎక్కువైందో? లేక ఇతర ఆరోగ్య కారణాలు తెలియదు కానీ.. షారూఖ్ ఖాన్‌కు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే అతని హెల్త్ అప్‌డేట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇటీవల షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్, డంకీ చిత్రాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్‌తో బిజీగా ఉన్న షారూఖ్ ఖాన్.. కేకేఆర్ ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరయ్యాడు. తన స్పీచ్‌లతో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాడు.

Story first published: Wednesday, May 22, 2024, 19:04 [IST]
Other articles published on May 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+