కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 272/7 స్కోర్ నమోదు చేసింది. ఈ క్రమంలో ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్‌ల భారీ స్కోర్లను కేకేఆర్ అధిగమించింది.
అయితే మరో 5 పరుగుల దూరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన 277 పరుగుల హయ్యెస్ట్ స్కోర్ రికార్డును అందుకోలేకపోయింది. ఈ సీజన్‌లోనే ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది.

ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్లు
277/3 - సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై, హైదరాబాద్, 2024
272/7 - కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ, వైజాగ్, 2024*
263/5 - ఆర్‌సీబీ వర్సెస్ పుణేవారియర్స్, బెంగళూరు, 2013
257/5 - లక్నో వర్సెస్ పంజాబ్, మొహాలి, 2023
248/3 - ఆర్‌సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్, బెంగళూరు, 2016
టీ20 క్రికెట్‌లో అత్యధిక స్కోర్లు
314/3 - నేపాల్ వర్సెస్ మంగోలియా, హాంగ్జౌ, 2023
278/3 - అఫ్గానిస్థాన్ వర్సెస్ ఐర్లాండ్, డెహ్రాడూన్, 2019
278/4 - చెక్ రిపబ్లిక్ వర్సెస్ టర్కీ, ఇల్‌ఫోవ్ కౌంటీ, 2019
277/3 - సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై, హైదరాబాద్, 2024
271 - కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ, వైజాగ్, 2024*
సునీల్ నరైన్(39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) విధ్వంసకర బ్యాటింగ్‌తో కేకేఆర్ ఈ రికార్డు సాధించింది. అతనికి తోడుగా అంగ్‌క్రిష్ రఘువంశీ(27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆండ్రీ రస్సెల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41), రింకూ సింగ్(8 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26) మెరుపులు మెరిపించారు. చివరి ఓవర్‌లో ఆండ్రీ రస్సెల్ ఔటవ్వడంతో కేకేఆర్ ఆల్‌టైమ్ రికార్డ్ అందుకోలేకపోయింది.