Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యాను విమర్శించడం సరికాదు: కీరన్ పొలార్డ్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్ అండగా నిలిచాడు. హార్దిక్ పాండ్యాను విమర్శించడం సరికాదని తెలిపాడు. హార్దిక్ వ్యక్తిత్వంపై చేస్తున్న వ్యాఖ్యలను చూసి తాను విసిగిపోయానని అసహనం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తమ జట్టు సారథిగా హార్దిక్ పాండ్యాను నియమించింది. ఈ నిర్ణయంపై జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో పాటు అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ సహించలేకపోయారు. దాంతో ప్రతీ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా‌ను గేలి చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

IPL 2024 Kieron Pollard sick and fed up of people pinpointing Hardik Pandya

తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఓటమి అనంతరం కూడా హార్దిక్ పాండ్యాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హార్దిక్ వల్లనే ముంబై ఇండియన్స్ ఓడిందని సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు ఘాటుగా విమర్శించారు. ఈ విమర్శలపై కీరన్ పోలార్డ్ తనదైన శైలిలో స్పందించాడు. 'ఇలాంటి విమర్శలు, కామెంట్లు పాండ్యా ఆత్మవిశ్వాసంపై ఏమాత్రం ప్రభావం చూపవు.

అతను ప్రతీ చిన్న విషయానికి కుంగిపోయే రకం కాదు. జట్టుగా మేమంతా అతనికి అండగా ఉంటాం. క్రికెట్‌లో జట్టుగా రాణిస్తేనే విజయవకాశాలు మెరుగుపడుతాయి. జట్టులో వ్యక్తిగతంగా ఎవరు ఎంత కష్టపడుతున్నారనేది నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. పాండ్యా తన నైపుణ్యం పెంచుకునేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు.

అలాంటి హార్దిక్‌పై వస్తున్న విమర్శలు విసిగెత్తిస్తున్నాయి. వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రస్తుతం ముంబైకి ఆడుతున్న అతను ఐపీఎల్ తర్వాత టీమిండియాకు ఆడుతాడు. ఇప్పుడు తిట్టేవాళ్లే అప్పుడు అతను బాగా ఆడాలని కోరుకుంటారు. వీలైతే ప్రోత్సహించేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ ప్రతీ విషయానికి దెబ్బి పొడవడం సరికాదు. ప్రపంచలోనే గొప్ప ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా'అని కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, April 15, 2024, 18:10 [IST]
Other articles published on Apr 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+