Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: కావ్య పాప.. మాకెందుకు ఈ గోస! ఆర్‌సీబీ అట్టర్ ఫ్లాఫ్ కోచ్ మనకు అవసరమా?

హైదరాబాద్: అందరూ ఊహించినట్లుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కోచ్‌ను నియమించింది. గత రెండేళ్లుగా జట్టుకు సేవలందించిన బ్రియాన్ లారాకు వీడ్కోలు పలికిన ఆరెంజ్ ఆర్మీ.. న్యూజిలాండ్ దిగ్గజ ప్లేయర్ డానియల్ వెటోరికి కోచింగ్ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సోమవారం ట్విటర్ వేదికగా ప్రకటించింది.

డానియల్ వెటోరికి ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్‌గా.. కోచ్‌గా ఆ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. 2009 సీజన్‌లో కెప్టెన్‌గా ఫైనల్ తీసుకెళ్లిన వెటోరి 2014 నుంచి 2018 వరకు కోచ్‌గా ఆర్‌సీబీకి సేవలందించాడు. వెటోరి పర్యవేక్షణలో ఆర్‌సీబీ 2016 సీజన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లి ఇదే సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది.

Kaviya Maran

2017, 2018 సీజన్‌లో ఆర్‌సీబీ దారుణంగా విఫలమవ్వడంతో వెటోరిపై ఆ టీమ్ మేనేజ్‌మెంట్ వేటు వేసింది. ఫ్రాంచైజీ లీగ్స్‌లో కోచ్‌గా వెటోరికి మంచి అనుభవం ఉంది. బిగ్‌బాష్, ది హండ్రెడ్, కరేబియన్ లీగ్స్‌లో అతను కోచ్‌గా సేవలందిస్తున్నాడు. ఇటీవల భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా స్పిన్ కోచ్‌గా సేవలందించాడు.

అయితే వెటోరి నియామకంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతని నియామకం జట్టుకు కలిసొస్తుందని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం సన్‌రైజర్స్‌ను ఆ దేవుడు కూడా కాపాడలేడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఫన్నీ మీమ్స్, కామెంట్స్‌తో ఆడుకుంటున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ మరోసారి అదే తప్పిదం చేసిందని, కోచ్‌గా ఏ మాత్రం మంచి రికార్డు లేని వెటోరిని తీసుకొచ్చిందని విమర్శిస్తున్నారు. వెటోరి కూడా ఈ ఒక్క సీజన్‌కే పరిమితమవుతాడని సెటైర్లు పేల్చుతున్నారు. ఆర్‌సీబీనే సర్వనాశనం చేసిన వెటోరిని సన్‌రైజర్స్ ఎలా నమ్మిందని మండిపడుతున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మరోసారి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవి శాస్త్రి, టామ్ మూడీ, మైక్ హెస్సెన్‌లను పరిశీలించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఆర్‌సీబీని ఫైనల్ చేర్చినట్లే.. సన్‌రైజర్స్‌కు టైటిల్ అందిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Monday, August 7, 2023, 19:09 [IST]
Other articles published on Aug 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+