Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ కోచ్‌గా ఆసీస్ మాజీ ప్లేయర్!

న్యూఢిల్లీ: లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ నియమితులయ్యారు. ఈ మేరకు లక్నో సూపర్ జెయింట్స్ ట్విటర్ వేదికగా ఓ ప్రకటనను విడదలు చేసింది. మాజీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియడంతో కొత్త కోచ్‌గా జస్టిన్ లాంగర్‌ను నియమించామని లక్నో సూపర్ జెయింట్స్ పేర్కొంది.

ఆండీ ఫ్లవర్ అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొంది. ఇక ఆస్ట్రేలియా హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్ అద్భుత ఫలితాలు రాబట్టాడని గుర్తు చేసింది. యాషెస్ సిరీస్‌లో విజయం సాధించడంతో పాటు అతని హయాంలోనే ఆసీస్ టీ20 ప్రపంచకప్ 2021 టైటిల్ గెలిచిందని పేర్కొంది. బిగ్‌బాష్ లీగ్‌లో జస్టిన్ లాంగర్ గైడెన్సీలో పెర్త్ స్కార్చర్స్ టీమ్ మూడు సార్లు విజేతగా నిలిచిందని తెలిపింది.

IPL 2024: Justin Langer appointed as the Head coach of Lucknow Supergiants

లక్నో సూపర్ జెయింట్స్ కూడా లాంగర్ పర్యవేక్షణలో అద్భుత ఫలితాలు సాధిస్తుందని టీమ్ భావిస్తోందని పేర్కొంది. లక్నో సూపర్ జెయింట్స్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడంపై జస్టిన్ లాంగర్ సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవిత ప్రయాణంలో ఇదో గొప్ప విషయమని తెలిపాడు. ఐపీఎల్‌లో లక్నోకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, దాన్ని మరింత మెరుగుపరిచేదుకు తన వంత కృషి చేస్తానని చెప్పాడు.

ఆసీస్ సీనియర్ ఆటగాళ్లతో వచ్చిన విబేధాలతో జస్టిన్ లాంగర్.. తన కోచింగ్ బాధ్యతలను వదులుకున్నాడు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్‌తో ఉన్న విబేధాలు, ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు గుప్పించడం అప్పట్లో తీవ్ర చర్చనీయంశమైంది.

ఐపీఎల్ 2022 సీజన్‌తో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్.. వరుసగా రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరి ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇంటిదారిపట్టింది. ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ప్రక్షాళనకు దిగింది. ముందుగా కోచ్ ఆండీ ఫ్లవర్‌పై వేటు వేసి కొత్త కోచ్‌ను నియమించుకుంది. మెంటార్ గౌతమ్ గంభీర్‌ను కూడా తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్న లక్నో సూపర్ జెయింట్స్.. జట్టు భారంగా మారిన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఓ జాబితాను కూడా సిద్దం చేసినట్లు టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.

Story first published: Friday, July 14, 2023, 20:21 [IST]
Other articles published on Jul 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+