న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. గత సీజన్ వరకు పేస్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగిన డేయిల్ స్టెయిన్.. వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌కు పేస్ బౌలింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆరెంజ్ ఆర్మీ (SRH) ఓ ప్రకటనను విడుదల చేసింది. 'డేయిల్ స్టేయిన్ ఈ సీజన్ కోసం జట్టుతో కలవడం లేదు. వ్యక్తిగత కారణాలతో అతను బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను మా నూతన బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నాం.'అని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్రకటనలో పేర్కొంది. అలాగే జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను జట్టులోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.

ఫ్రాంక్లిన్ 2011, 2012 సీజన్లు ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు. కోచ్‌గా ఐపీఎల్‌లో పని చేసిన అనుభవం మాత్రం అతనికి లేదు. కౌంటీ క్రికెట్‌లో మిడిల్ సెక్స్, డర్హమ్ జట్లతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, బర్మింగ్‌హామ్ ఫొనిక్స్ జట్లకు ఫ్రాంక్లిన్ కోచ్‌గా సేవలందించారు.
అంతేకాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరికి జేమ్స్ ఫ్రాంక్లిన్ అత్యంత సన్నిహితుడు. ఈ ఇద్దరూ న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. మిడిల్ సెక్స్, బర్మింగ్‌హామ్ జట్లకు కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు.
అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టు సారథ్య బాధ్యతలను ప్యాట్ కమిన్స్‌ను అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. 'ఆరెంజ్ ఆర్మీ.. మన కొత్త నాయకుడు ప్యాట్ కమిన్స్' అని ట్విటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోస్ట్ చేసింది. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్స్ కోసం సన్‌రైజర్స్ రూ.20.50 కోట్లు కుమ్మరించిన విషయం తెలిసిందే.
ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ కోసం త్రిముఖ వ్యూహంతో భారీ ధర వెచ్చించింది. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్‌గా ఉపయోగించుకోవచ్చని కమిన్స్‌ను సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ 22 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. ఫస్టాఫ్ షెడ్యూల్‌లో హైదరాబాద్ వేదికగా రెండు మ్యాచ్‌లు మాత్రమే జరగనున్నాయి. మార్చి 23న ముంబైతో తొలి మ్యాచ్ జరగనుండగా.. ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌తో మరో మ్యాచ్ జరగనుంది. ఈ ఫస్టాఫ్ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్ మొత్తం 4 మ్యాచ్‌లు ఆడనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు:
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్‌రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ (ట్రేడ్), అభిషేక్ శర్మ, మార్కో జేన్సన్, వాషింగ్టన్ సుందర్, సాన్‌విర్‌సింగ్ , భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగ, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ మహరాజ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్.