Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: సీఎస్‌కే‌కు తలనొప్పిగా జడేజా.. కెప్టెన్సీ దక్కనందుకే ఇలా చేస్తున్నాడా?

ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దారుణంగా విఫలమవుతున్నాడు. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లోనూ తేలిపోతున్నాడు. కెప్టెన్సీ మార్పు నిర్ణయం కారణంగానే జడేజా ఇలా దారుణంగా విఫలమవుతున్నాడా? అనే వాదన వినిపిస్తోంది.

తనను కాదని రుతురాజ్ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని జడేజా సహించలేకపోతున్నాడా? ఈ నిర్ణయం అతనికి తీవ్ర మానసిక క్షోభను మిగిల్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

IPL 2024 Jadeja display CSK prompts curiosity Could captaincy rejection be driving his stellar show

జడేజా తడబాటు..
గత 10 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌కు వెన్నుముకలా నిలుస్తున్న జడేజా.. గతేడాది అసాధారణ ప్రదర్శనతో జట్టుకు టైటిల్ అందించాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో సంచలన బ్యాటింగ్ ప్రదర్శనతో చిరస్మరణీయ విజయాన్నందించాడు. అలాంటి జడేజా ఈ సీజన్‌లో మాత్రం ఇప్పటి వరకు తన మార్క్‌ను చూపించలేకపోయాడు.

బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశాలు రాకపోయినా బౌలింగ్‌లో మాత్రం గత నాలుగు మ్యాచ్‌ల్లో సత్తా చాటలేకపోయాడు. వాస్తవానికి రుతురాజ్ గైక్వాడ్ కంటే ముందే జడేజాకు సారథ్య బాధ్యతలు దక్కాయి. కానీ ఆ ఒత్తిడిని అతను అధిగమించలేకపోయాడు. కెప్టెన్‌గా తడబడటంతో పాటు వ్యక్తిగతంగానూ రాణించలేకపోయాడు.

కెప్టెన్సీ మార్పుతో..
దాంతో అతని కెప్టెన్సీపై వేటు వేసిన సీఎస్‌కే మేనేజ్‌మెంట్ మళ్లీ ధోనీకే సారథ్య బాధ్యతలు అప్పగించింది. దాంతో జడేజా చెన్నై జట్టు వీడుతాడనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ గత సీజన్‌లో జడేజా ధోనీ సారథ్యంలో చెన్నైకే ఆడాడు. లీగ్ మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించకపోయినా.. ఫైనల్లో మాత్రం అసాధారణ ప్రదర్శనతో చెలరేగాడు.

అయితే 2022 నుంచి జడేజా ప్రదర్శన దిగజారుతోంది. బ్యాటింగ్‌లో అతని స్ట్రైక్‌రేట్ 133గానే ఉంది. గత 25 ఇన్నింగ్స్‌ల్లో అతని అత్యధిక స్కోర్ 26 పరుగులు మాత్రమే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లోనూ అతను 6 బంతుల్లో 15 పరుగులే చేశాడు. కాకపోతే ఆఖరి ఓవర్‌లో క్లిష్ట పరిస్థితుల్లో భారీ షాట్ ఆడి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

స్పిన్ బౌలింగ్ ఆడలేక..
ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ ఆడటంలో జడేజా తీవ్రంగా తడబడుతున్నాడు. 2022 నుంచి 73 స్పిన్ బాల్స్ ఆడిన జడేజా కేవలం 83 పరుగులే చేశాడు. ఇక విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో జడేజా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మరో ఎండ్‌లో ధోనీ భారీ షాట్లతో చెలరేగినా.. జడేజా అతనికి ఏ మాత్రం సహకరించలేదు.

ఈ మ్యాచ్‌లో ధోనీకి జడేజా కాస్త మద్దతు ఇచ్చి ఉంటే సీఎస్‌కే విజయం సాధించేది. జడేజా జిడ్డు బ్యాటింగ్ సీఎస్‌కేకు తలనొప్పిగా మారింది. అయినా జడేజాపై సీఎస్‌కే మెనేజ్‌మెంట్ విశ్వాసాన్ని కొనసాగిస్తోంది. మరి జడేజా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా? కెప్టెన్సీ దక్కలేదనే కోపంతో పేలవ ఫామ్‌ను కొనసాగిస్తాడా? అనేది చూడాలి.

Story first published: Friday, April 5, 2024, 19:40 [IST]
Other articles published on Apr 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+