For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: పాపం మయాంక్ యాదవ్.. రెండు మ్యాచ్‌లకే దూరం!

'అదృష్టం తలుపు తడితే.. దురుదృష్టం వెక్కిరించింది'అంటే ఇదేనేమో! సంచలన బౌలింగ్‌తో టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్‌గా నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్.. రెండు మ్యాచ్‌లకే గాయపడ్డాడు.

గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్.. పక్కటెముకల గాయంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.

IPL 2024 Injury threatens LSG star pacer Mayank Yadav s future and prospects for India

బ్యాటర్లను భయపెట్టి..
గంటకు 153 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసి బ్యాటర్లను బెంబేలెత్తించిన మయాంక్ యాదవ్ అంతలోనే గాయపడ్డాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. కళ్లు చెదిరే బౌలింగ్‌తో తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తన పేస్‌తో 6 వికెట్లు పడగొట్టాడు. 157.6 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించి ఫాస్టెస్ బాల్ రికార్డ్‌ను అందుకున్నాడు. వేగానికి తోడు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్, వేరియేషన్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

టీ20 ప్రపంచకప్‌ జట్టులో..
తన చూడ చక్కటి బౌలింగ్‌తో టీ20 ప్రపంచకప్ 2024 జట్టులోకి తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్లంతా డిమాండ్ చేసేలా సంచలన ప్రదర్శన కనబర్చాడు.
అత్యంత వేగంగా బంతులు సంధించడమో.. లేక అతని దురదృష్టమో ఏమో కానీ మయాంక్ యాదవ్ రెండు మ్యాచ్‌లకే గాయపడ్డాడు.

గత రెండు సీజన్లుగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోనే కొనసాగుతున్న అతను గాయాలతోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ సారి బరిలోకి దిగినా.. అంతలోనే మరోసారి గాయపడ్డాడు.

IPL 2024 Injury threatens LSG star pacer Mayank Yadav s future and prospects for India

డేంజర్ జోన్‌లో మయాంక్ యాదవ్..
తాజా గాయంతో అతని కెరీర్ ప్రమాదంలో పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్.. రెండు బంతులను మాత్రమే గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలిగాడు.

గత రెండు మ్యాచ్‌లకు భిన్నంగా స్లో‌గా బౌలింగ్ చేసిన అతను 6 బంతుల్లో 13 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ వెంటనే పక్కటెముకలు పట్టేసాయని మైదానం వీడాడు.

సీరియస్ కాదంటున్నా..
ఈ మ్యాచ్‌లో యశ్ ఠాకూర్ సంచలన బౌలింగ్‌తో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆ జట్టు సీనియర్ ప్లేయర్ కృనాల్ పాండ్యా మయాంక్ యాదవ్ గాయంపై స్పందించాడు. అతనికి సీరియస్ ఇంజ్యూరీ ఏం కాలేదని తెలిపాడు.

'మయాంక్ యాదవ్ బాగానే ఉన్నాడు. అతని ఎలాంటి సీరియస్ ఇంజ్యూరీ కాలేదు. మాకు కాస్త ఉపశమనం ఇచ్చే వార్త ఇది. గత రెండేళ్లుగా అతన్ని నేను దగ్గరగా చూస్తున్నాను. బౌలింగ్ గన్‌లా అతను నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడు. అతనికి మంచి భుజ బలం ఉంది.'అని చెప్పుకొచ్చాడు.

సీరియస్ ఇంజ్యూరీ కాదని కృనాల్ పాండ్యా చెబుతున్నా.. మయాంక్ యాదవ్ మరో రెండు మ్యాచ్‌ల వరకు దూరమయ్యే అవకాశం ఉంది.

Story first published: Monday, April 8, 2024, 17:58 [IST]
Other articles published on Apr 8, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+