Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ఆ సెంటిమెంట్ కొనసాగితే ఫైనల్లో ఆర్‌సీబీ!

ఐపీఎల్ 2024 సీజన్‌లో అనూహ్యంగా పుంజుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. ఫస్టాఫ్ సీజన్‌లో వరుస ఓటములతో చతికిల పడిన ఆర్‌సీబీ.. సెకండాఫ్‌లో మాత్రం దుమ్మురేపుతోంది. తొలి 8 మ్యాచ్‌ల్లో ఒక్క విజయమే నమోదు చేసిన ఆర్‌సీబీ.. తర్వాతి ఐదు మ్యాచ్‌లకు ఐదు గెలిచింది.

దాంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 47 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆర్‌సీబీ రన్‌రేట్ కూడా మెరుగుపరుచుకుంది. ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో చెన్నైని 18 పరుగుల తేడాతో ఓడించడం లేదా.. 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధిస్తేనే చెన్నై సూపర్ కింగ్స్ కంటే మెరుగైన రన్‌రేట్ సాధించి ప్లే ఆఫ్స్ చేరుతుంది.

IPL 2024 If this sentiment repeats RCB will qualify final

ఓడితే మాత్రం ఇంటి బాట పడుతోంది. అయితే ఆర్‌సీబీ వరుసగా విజయాలు సాధించినప్పుడల్లా ప్లే ఆఫ్స్ చేరడంతో పాటు ఫైనల్ చేరింది. 2011 సీజన్‌లో ఆర్‌సీబీ వరుసగా 7 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్ చేరింది. కానీ టైటిల్ ఫైట్‌లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

2009 సీజన్‌లో వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ చేరింది. అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.

2010, 2021లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఇదే సెంటిమెంట్ కొనసాగితే ఈసారి కూడా ఆర్‌సీబీ ఫైనల్ చేరుతుందని ఆ జట్టు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. కామెరూన్ గ్రీన్(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 32 నాటౌట్), విల్ జాక్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) రాణించారు.

విరాట్ కోహ్లీ(13 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27) ధాటిగా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రసిక్ సలామ్(2/23), ఖలీల్ అహ్మద్(2/31) రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. షై హోప్(23 బంతుల్లో 4 ఫోర్లతో 29) పర్వాలేదనిపించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో యశ్ దయాల్ 3 వికెట్లు తీయగా.. స్వప్నిల్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.

ఈ గెలుపుతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగురుచుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం తమ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.

Story first published: Monday, May 13, 2024, 8:53 [IST]
Other articles published on May 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+