Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 విజేత‌కు ప్రైజ్‌మనీ ఎంత అంటే..?

ఐపీఎల్ 2024 సీజన్‌ తుది దశకు చేరింది. మరికొద్ది సేపట్లో చెన్నై వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. మొత్తం రూ.46.5 కోట్లను బీసీసీఐ ప్రైజ్‌మనీ అందించనుంది.

విజేత జట్టుకు రూ. 20 కోట్ల క్యాష్ ప్రైజ్ దక్కనుండగా.. రన్నరప్ టీమ్ రూ. 13 కోట్ల క్యాష్ రివార్డ్ లభించనుంది. మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ. 7 కోట్లు,.. నాలుగో స్థానం కైవసం చేసుకున్న ఆర్‌సీబీకి రూ. 6.5 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.

IPL 2024 How Much Is The IPL 17 Final Prize Money

ఎమర్జింగ్ ప్లేయర్ టోర్నీ అవార్డు అందుకున్న ఆటగాడికి రూ. 20 లక్షలు, ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌, పర్పుల్ క్యాప్‌ అందుకున్న ఆటగాడికి, పవర్ ప్లే ఆఫ్ ది సీజన్ అవార్డు అందుకున్న ఆటగాళ్లకు రూ. 15 లక్షల చొప్పున క్యాష్ రివార్డ్ దక్కనుంది. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, గేమ్ ఛేంజర్ ఆఫ్ సీజన్ ప్లేయర్లకు రూ. 12 లక్షల అవార్డు అందుకోనున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్‌ లీగ్ దశలో టాప్-4లో నిలిచిన కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో కేకేఆర్ విజయం సాధించి ఫైనల్ చేరింది. మరోవైపు రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2లో మరోసారి తలపడిన సన్‌రైజర్స్ 36 పరుగుల భారీ తేడాతో గెలుపొంది టైటిల్ ఫైట్‌కు సిద్దమైంది. ఈ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ గెలిచి.. ఆ రెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.

Story first published: Sunday, May 26, 2024, 17:52 [IST]
Other articles published on May 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+