Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs SRH: పంజాబ్‌తో మ్యాచ్.. హెన్రీచ్ క్లాసెన్‌కు ప్రమోషన్!

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి జోరు మీదున్న సన్‌రైజర్స్ అదే జోరులో పంజాబ్‌ను ఓడించాలనుకుంటోంది.

ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఓవర్‌సీస్ స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకురావాలనుకుంటోంది. ఇందుకోసం హెన్రీచ్ క్లాసెన్‌కు ప్రమోషన్ ఇచ్చేందుకు సిద్దమైంది. వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి అతన్ని తప్పించి.. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయించాలనుకుంటోంది.

IPL 2024 Heinrich Klaasen To Earn Promotion Travis Head Out SRH Likely Playing XI VS PBKS

తద్వారా ముగ్గురు ఓవర్‌సీస్ ఆటగాళ్లతోనే బరిలోకి దిగి.. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటర్ అవసరమైతే ట్రావిస్ హెడ్, స్పిన్నర్‌ను తీసుకోవాలనుకుంటే షంసీ, గ్లేన్ ఫిలిప్స్‌ను ఆడించాలనుకుంటోంది. వికెట్ కీపర్‌గా యూపీ కుర్రాడు ఉపేంద్ర యాదవ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌పై వేటు వేసిన సన్‌రైజర్స్ మెనేజ్‌మెంట్ నితీష్ కుమార్‌ రెడ్డికి అవకాశం ఇచ్చింది.

పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు హెన్రీచ్ క్లాసెన్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తుండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. జట్టులో హెన్రీచ్ క్లాసెన్‌కు కొత్త పాత్ర అంటూ సన్‌రైజర్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. క్లాసెన్‌ను టాప్-3లో ఆడించి.. గ్లేన్ ఫిలిప్స్‌ను జట్టులోకి తీసుకుంటే ఎలా ఉంటుందనేదానిపై సమాలోచనలు చేస్తోంది. ఫిలిప్స్.. బ్యాటింగ్, కీపింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు.

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ షేర్ చేసిన క్లాసెన్ ఫీల్డింగ్ పొజిషన్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అనవసర ప్రయోగాలతో జట్టును నాశనం చేయవద్దని సూచిస్తున్నారు. ఓవర్‌సీస్ ఆటగాళ్లలో ఎలాంటి మార్పులు చేయవద్దని, ఇండియన్ స్పిన్నర్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఫారిన్ స్పిన్నర్ల కంటే ఇండియన్ స్పిన్నర్లను ఆడించడం మంచిందని హితవు పలుకుతున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు (అంచనా)

అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్/ఉపేంద్ర యాదవ్, నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్: ట్రావిస్ హెడ్, గ్లేన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్

Story first published: Monday, April 8, 2024, 22:03 [IST]
Other articles published on Apr 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+