IPL 2024: అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు పాండ్యా.. రోహిత్ మీడియా మేనేజ్‌మెంట్‌కు బలి!
ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తీసుకున్న కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతోంది. టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. అయితే ఈ మార్పును రోహిత్ ఫ్యాన్స్ సహించలేకపోతున్నారు.
ఆ కోపాన్ని హార్దిక్ పాండ్యాపై చూపిస్తున్నారు. హార్దిక్ పాండ్యా టీమిండియా ఆటగాడనే విషయాన్ని మరిచిపోయి దారుణంగా ట్రోల్ చేయడంతో పాటు తమ కామెంట్స్‌తో ఎగతాళి చేస్తున్నారు. హార్దిక్ ఎక్కడ కనిపించినా.. రోహిత్ అని గట్టిగా అరుస్తూ తీవ్రంగా అవమానిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగానే కాకుండా.. మైదానంలో, ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడ కనబడితే అక్కడ హార్దిక్‌ను ట్రోల్ చేస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిమానులు హద్దులు ధాటి ప్రవర్తించారు. మ్యాచ్ అసాంతం అతన్ని అవమానపరిచారు. అభిమానుల తీరుపై దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా సైతం అసహనం వ్యక్తం చేశాడు. 'హార్దిక్ పాండ్యా 2 ఓవర్లు బౌలింగ్ చేస్తే.. రోహిత్ శర్మ అభిమానులు అతన్ని 15 సార్లు అవమానపరిచారు. ఇది ఏ మాత్రం సరైన చర్య కాదు.'అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
అయితే హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేయడం వెనుక రోహిత్ మీడియా మేనేజ్‌మెంట్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అతనికి సంబంధించిన పీఆర్‌లే ఈ చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో విరాట్ కోహ్లీని ఇలానే ప్రతీ విషయానికి ట్రోల్ చేసి కెప్టెన్సీ నుంచి తప్పించేలా చేసారని గుర్తు చేస్తున్నారు.
అప్పుడు విరాట్ కోహ్లీకి అండగా అతని అభిమానులు రోహిత్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు గట్టి కౌంటరిచ్చేవారని, కానీ హార్దిక్ పాండ్యాకు మద్దతుగా అతని అభిమానులు కూడా మాట్లాడలేకపోతున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మ అభిమానుల తీరును తప్పుబట్టాడు.
ఐపీఎల్ కంటే ముందు భారత క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, హార్దిక్ పాండ్యా కూడా భారత్‌కు చెందిన ఆటగాడేనని, అతన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున హార్దిక్ పాండ్యా ఓ టైటిల్ అందించడంతో పాటు మరోసారి ఫైనల్‌కు తీసుకెళ్లాడని, అతను కూడా సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అని గుర్తు చేశాడు.
అంతేకాకుండా రోహిత్ శర్మ తర్వాత టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకునేందుకు హార్దిక్ పాండ్యా సిద్దంగా ఉన్నాడని, ఏ ఆటగాడు కూడా జట్టులో శాశ్వతంగా కొనసాగడనే విషయాన్ని గుర్తించాలని రిక్వెస్ట్ చేశాడు. మాజీ క్రికెటర్లు సైతం అభిమానుల్లా విమర్శలు గుప్పిస్తూ.. రోహిత్Xహార్దిక్ గొడవకు ఆజ్యం పోయవద్దని కోరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications