For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: అతని కోసమే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు..!

IPL 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు తీవ్ర చర్చనీయాంశమైంది. ఐదు టైటిళ్లు అందించి సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మను తప్పించి ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. జట్టు భవిష్యత్తును పరిగణలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.

అయితే రోహిత్ శర్మ అభిమానులు మాత్రం ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పించడం అన్యాయం అంటూ మండిపడుతున్నారు. కొందరైతే ఆ జట్టుకు మద్దతు ఇవ్వమని.. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను అన్‌ఫాలో చేస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది ముంబై జట్టును అన్‌ఫాలో చేశారు.

 IPL 2024: Hardik Pandya Set Condition To Return Only As Captain Of Mumbai Indians

ఇంకొందరైతే.. ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే పథకం ప్రకారమే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని మార్చినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని ముంబై ఇండియన్స్ టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.

రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉండటంతో ముంబై ఇండియన్స్ భవితవ్యంపై ఆ టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్ర చర్చలు జరిపింది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ కోసం అప్రోచ్ అయ్యింది. అతను జట్టులోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పినా.. ఓ కండిషన్ పెట్టాడంట. కెప్టెన్సీ ఇస్తేనే ముంబై జట్టులోకి వస్తానని చెప్పాడటం.

వెంటనే ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మకు చెప్పిందంట. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడేందుకు రోహిత్ అంగీకరించడంతో ముంబై ఇండియన్స్ ముందుడుగు వేసిందని ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.

Story first published: Saturday, December 16, 2023, 16:07 [IST]
Other articles published on Dec 16, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+