IPL 2024: గుజరాత్‌లోనే హార్దిక్ పాండ్యా.. రిలీజ్, రిటైన్ జాబితా ఇదే!
GT Retained Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట కలకలం రేపిన హార్దిక్ పాండ్యా వ్యవహారం అంత ఉత్తదేనని తేలింది. ట్రేడింగ్ విండో ద్వారా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వెళ్తున్నాడని జరిగిన ప్రచారంలో నిజం లేదని స్పష్టమైంది. ఐపీఎల్ 2024 మినీ వేలం నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకుంది.
8 మంది ఆటగాళ్లను మాత్రమే ఆ జట్టు రిలీజ్ చేసింది. దాంతో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లోకి వెళ్తున్నాడని, ఆ ఫ్రాంచైజీ అతనితో పాటు గుజరాత్ ఫ్రాంచైజీకి భారీ డబ్బు ఆఫర్ చేసిందని వచ్చిన వార్తలు అన్నీ నిరాదారణమైనవని తేలిపోయింది.

తెలుగు తేజం కేఎస్ భరత్‌తో పాటు ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు సమర్పించుకున్న యశ్ దయాల్‌కు ఉద్వాసన పలికింది. ఈ ఇద్దరితో పాటు శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సంగ్వాన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, డసన్ షనకలకు గుజరాత్ టైటాన్స్ గుడ్‌బై చెప్పింది. దాదాపు తమ కోర్ టీమ్ మొత్తాన్ని రిటైన్ చేసుకుంది.
గుజరాత్ టైటాన్స్ రిటైన్ లిస్ట్:
డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్దిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నలకందే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తేవాటియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, మోహిత్ శర్మ
గుజరాత్ టైటాన్స్ రిలీజ్డ్ లిస్ట్
యశ్ దయాల్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సంగ్వాన్, ఒడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, డసన్ షనక.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications