For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: రిషభ్ పంత్‌‌కు గూగుల్ ఘన స్వాగతం.. ఏం చేసిందంటే..?

టీమిండియా స్టార్ వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు గూగుల్ ఘన స్వాగతం పలికింది. సోషల్ మీడియా వేదికగా అతని రీఎంట్రీని ఉద్దేశిస్తూ స్పెషల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

రోడ్డు ప్రమాదంతో గతేడాదిన్నరగా ఆటకు దూరంగా ఉన్న రిషభ్ పంత్..
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. దాదాపు 454 రోజుల తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు.

IPL 2024 Google India Shares special Welcome Message for returning Rishabh Pant vs Punjab

ఇదే విషయాన్ని తెలియజేస్తూ గూగుల్ ఇండియా.. రిషభ్ పంత్‌కు ఘన స్వాగతం పలికింది. 'చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం.. ఘన స్వాగతం'అనే క్యాప్షన్‌తో ఓ పోస్ట్‌ను పంచుకుంది. ఈ పోస్ట్‌లో గూగుల్ సెర్చ్ బార్‌లో 'how long ago was 25/12/2022 అని రాసి ఉండగా.. రిజల్డ్‌లో కౌంట్ డేస్ 454 రోజులని ఉంది.'ఈ స్క్రీన్ షాట్‌ను తమ ట్వీట్‌కు జత చేసింది.

ఈ పోస్ట్ నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంది. ఇక రీఎంట్రీ‌లో రిషభ్ పంత్(13 బంతుల్లో 2 ఫోర్లతో 18) తీవ్రంగా నిరాశపరిచాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 2022 డిసెంబర్ 30న రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కొత్త ఏడాది తమ కుటుంబ సభ్యులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పా పెట్టకుండా సొంత కారులో ఒంటరిగా ఢిల్లీ నుంచి రూర్కీకి బయలుదేరిన పంత్.. నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొట్టాడు.

అతివేగంగా నడపడంతో ప్రమాద ధాటికి అతని బీఎండబ్ల్యూ కారు పూర్తిగా దగ్దమైంది. ఆ రోడ్డుపై అటుగా వెళ్తున్న ఇతర ప్రయాణికులు రిషభ్ పంత్‌ను రక్షించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. పలు శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. ఇటీవలే పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్‌తో మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభించాడు.

ఈ ప్రమాదంలో తాను ప్రాణాలతో బయటపడటం అద్భుతమని చెప్పిన పంత్.. మళ్లీ క్రికెట్ ఆడుతానని అనుకోలేదన్నాడు. ఏదో శక్తి తనను కాపాడిందని, ఇది తనకు పునర్జన్మని తెలిపాడు.

Story first published: Saturday, March 23, 2024, 22:33 [IST]
Other articles published on Mar 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+