ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) దుమ్మురేపుతోంది. 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలు 19 పాయింట్లతో అందరి కన్నా ముందే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకున్న కేకేఆర్.. టాప్-2 ప్లేస్‌ను ఖరారు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే తమ ఆఖరి మ్యాచ్‌లో ఓడినా కేకేఆర్ టాప్-2లో నిలవనుంది. తద్వారా ఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది.
క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఫైనల్ చేరుతోంది. ఓడితే క్వాలిఫయర్-2 ఆడే అవకాశం ఆ జట్టుకు ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టు కేకేఆర్. 2012, 2014 సీజన్లలో ఆ జట్టు గౌతమ్ గంభీర్ సారథ్యంలో టైటిళ్లు గెలిచింది.

ఈ రెండు సీజన్ల తర్వాత కేకేఆర్ 2021లో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత జరిగిన రెండు సీజన్లలో దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 2022, 2023 సీజన్లలో పేలవ ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచింది. దాంతో ఈ సీజన్‌లో కూడా కేకేఆర్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది.
కానీ తొలి మ్యాచ్ నుంచే అసాధారణ ప్రదర్శనతో వరుస విజయాలు సాధించింది. అత్యుత్తమ జట్లను తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మట్టికరిపించింది. మెంటార్‌గా గౌతమ్ గంభీర్ రీఎంట్రీ ఇవ్వడమే కేకేఆర్‌కు బలంగా మారింది.
గతేడాది వరకు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరించిన అతను.. ఈ సీజన్ ప్రారంభానికి ముందు కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు. తనదైన వ్యూహాలతో కేకేఆర్‌ను విజయాల బాట పట్టించాడు. మళ్లీ సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపించడం.. ఆండ్రీ రస్సెల్‌ను సరిగ్గా వాడుకోవడం వంటి విషయంలో గంభీర్ మార్క్ కనిపించింది.
మనీష్ పాండే వంటి వెటరన్ ప్లేయర్లను పరిస్థితులకు తగ్గట్లు ఆడించడం కూడా అతని మార్క్ వ్యూహానికి నిదర్శనం. కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న గంభీర్.. అందుకోసం రాజకీయాలను కూడా వదిలేసాడు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అయిన అతను ఐపీఎల్ కోసం ఈ సారి పోటీ నుంచి తప్పుకున్నాడు. అతని కమిట్‌మెంట్.. కేకేఆర్ విజయాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది.