For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024 వేలంలో భారీ ధర పలికే ఆటగాళ్లు వీరే!

IPL 2024 మినీ వేలానికి రంగం సిద్దమైంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియను ముగించిన బీసీసీఐ.. డిసెంబర్ 12తో ట్రేడింగ్ విండోను కూడా క్లోజ్ చేయనుంది. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలం నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ఆటగాళ్లను అంటిపెట్టుకొని భారంగా మారిన ప్లేయర్లను వదిలేసాయి.

ట్రేడింగ్ ద్వారా పక్క జట్లలోని అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఐపీఎల్ 2024 మినీ వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.100 కోట్లకు పెంచననున్నారు. గత వేలం ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ రూ.95 కోట్లుగా ఉంది. ఈ రూ.100 కోట్ల నుంచి రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వాల్యూ తీసేయగా మిగిలన అమౌంట్‌తో ఆయా జట్లు మినీ వేలంలో పాల్గొననున్నాయి.

అయితే ఐపీఎల్ 2024 వేలంలో ఓ ఐదుగురు ఆటగాళ్లు భారీ ధర పలికే అవకాశం ఉంది. వారు ఎవరో ఒకసారి లుక్కెద్దాం.

IPL 2024: Five players who could fetch over Rs 10 Crore in Upcoming IPL Auction

1. ప్యాట్ కమిన్స్: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారీ ధర పలికే అవకాశం ఉంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా ఆస్ట్రేలియా జట్టును విజేతగా నిలబెట్టాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం అతనికి కలిసొచ్చే అంశం. ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్యాట్ కమిన్స్‌ను కేకేఆర్ రూ.7.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో ఓ మెరుపు హాఫ్ సెంచరీతో అందర్నీ ఆకట్టుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఐపీఎల్ 2023 సీజన్‌కు అతను దూరంగా ఉన్నాడు.

ఐపీఎల్ 2024 సీజన్ కోసం రూ.2 కోట్ల కనీస ధరతో రిజిస్టర్ చేసుకున్నాడు. ప్యాట్ కమిన్స్‌ కోసం ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడే అవకాశం ఉంది. అతను రూ.10 కోట్లకు పైనే పలికే ఛాన్స్ ఉంది.

IPL 2024: Five players who could fetch over Rs 10 Crore in Upcoming IPL Auction

2. డారిల్ మిచెల్: న్యూజిలాండ్ కు చెందిన డారిల్ మిచెల్ కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. అతను నిలకడగా ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా విధ్వంసకర బ్యాటింగ్‌తో క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించాడు. బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటం అదనపు బలం. డారిల్ మిచెల్ రూ. 5- రూ.10 కోట్లు పలికే అవకాశం ఉంది.

IPL 2024: Five players who could fetch over Rs 10 Crore in Upcoming IPL Auction

3. మిచెల్ స్టార్క్: మిచెల్ స్టార్క్ సుదీర్ఘ కాలం తర్వాత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. 2015లో చివరి సారిగా ఆర్‌సీబీ తరఫున అతను బరిలోకి దిగాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం.. అనుభవం కలిగిన బౌలర్ కావడంతో స్టార్క్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి. ముఖ్యంగా ఆర్‌సీబీ అతని కోసం తీవ్రంగా పోటీ పడనుంది. సునాయసంగా రూ. 10 కోట్లకు పైనే పలికే అవకాశం ఉంది.

IPL 2024: Five players who could fetch over Rs 10 Crore in Upcoming IPL Auction

4. ట్రావిస్ హెడ్: వన్డే ప్రపంచకప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి. బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయినా.. ట్రావిస్ హెడ్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిర్భంగా బ్యాటింగ్ చేయగలడు. అతని కోసం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, పంజాబ్ కింగ్స్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తీవ్రంగా పోటీపడనున్నాయి. రూ. 5 నుంచి రూ. 10 కోట్లు పలికే ఛాన్స్ ఉంది.

IPL 2024: Five players who could fetch over Rs 10 Crore in Upcoming IPL Auction

5. రచిన్ రవీంద్ర: భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర వన్డే ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు భారత పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. ఈ క్రమంలోనే అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి. ముఖ్యంగా ఆర్‌సీబీ అతన్ని తీసుకునే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్‌తో పాటు సన్‌రైజర్స్ కూడా పోటీ పడనుంది.

Story first published: Tuesday, December 5, 2023, 23:06 [IST]
Other articles published on Dec 5, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+