ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్‌తో ఇదే వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో డ్యూ ప్రభావం కనిపించలేదని కమిన్స్ తెలిపాడు.
పిచ్‌ను రీడ్ చేయడం ఎప్పటికీ మంచిది కాదని చెప్పిన కమిన్స్.. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందన్నాడు. 'పిచ్ చూడటానికి బాగుంది. వికెట్‌ను రీడ్ చేయడం ఎప్పటికీ మంచిది కాదు. గత మ్యాచ్‌లో డ్యూ ప్రభావం ఏ మాత్రం లేదు. ఈ రోజు కూడా డ్యూ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వస్తే మాత్రం తీవ్ర నష్టం జరుగుతుంది.

మేం గత మ్యాచ్ మాదిరే సత్తా చాటాలనుకుంటున్నాం. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయడం మా ప్రణాళిక. లక్ష్యాలను కాపాడుకోవడంలో మాకు మంచి రికార్డ్ ఉంది. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అయితే అబ్దుల్ సమద్ స్థానంలో షెహ్‌బాజ్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చాడు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిచినా తాము బౌలింగ్ తీసుకునేవాళ్లమని కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ఈ పిచ్ గురించి మాకు బాగా తెలుసు. ఇది ఎర్రమట్టి నేల. గత మ్యాచ్‌లో కూడా మేం ఇదే తరహా వికెట్‌పై ఆడాం. మేం అతిగా ఆలోచించకుండా ప్రజెంట్‌లో ఉండాల్సిన అవసరం ఉంది.
మా బేసిక్స్‌కు కట్టుబడి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసే ప్రయత్నం చేయాలి. జట్టులోని ప్రతీ ఒక్కరు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఇదో పెద్ద మ్యాచ్. అయితే మా జట్టులో చాలా మంది తొలిసారి ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నారు. కాస్త ఆందోళనగా ఉన్నా.. ఇది మాకు మంచి అవకాశం. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, షెహ్‌బాజ్ అహ్మద్, జయదేవ్ ఉనాద్కత్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్
కేకేఆర్: సునీల్ నరైన్, రెహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, వైభవ్ అరోరా