Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 Final: మిచెల్ స్టార్క్ X ట్రావిస్ హెడ్ డిష్యూం డిష్యూం (వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై వేదికగా గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) 8 వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

ఈ ఫైనల్ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ సంచలన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసిన స్టార్క్.. ఆ వెంటనే ఇన్ ఫామ్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు.

IPL 2024 Final Mitchell Starc jokingly challenges Travis Head to take strike after 1st ball

ఈ మ్యాచ్‌లో సంచలన బౌలింగ్ పెర్ఫామెన్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్‌ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం నడిచింది. చాలా సరదాగా సాగిన ఈ ఘటన నవ్వులు పూయించింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్‌ను మిచెల్ స్టార్క్ ట్రోల్ చేశాడు.

దమ్ముంటే స్ట్రైక్‌ తీసుకోవాలని సవాల్ విసిరాడు. దానికి ట్రావిస్ హెడ్ చిరు నవ్వుతో సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అహ్మదాబాద్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్-2లోనూ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు.

ఈ మ్యాచ్‌లో తొలి బంతికే ట్రావిస్ హెడ్(0)ను క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ ట్రావిస్ హెడ్ చాలా సార్లు స్టార్క్ బౌలింగ్‌‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 ఫైనల్లో తొలి ఓవర్‌ను స్టార్క్ వేయడానికి సిద్దమవ్వగా.. ట్రావిస్ హెట్ స్ట్రైకింగ్ తీసుకోకుండా నాన్‌స్ట్రైకర్ వైపు నిలబడ్డాడు.

దాంతో అభిషేక్ శర్మ స్ట్రైక్ తీసుకున్నాడు. తొలి బంతి వేసిన అనంతరం స్టార్క్.. ట్రావిస్ హెడ్‌ను తన మాటలతో కవ్వించాడు. స్ట్రైక్ తీసుకునేందుకు భయపడ్డావా? దమ్ముంటే స్ట్రైక్ తీసుకో అంటూ రెచ్చగొట్టాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. స్టార్క్‌ను తప్పించుకుందామనుకున్న ట్రావిస్ హెడ్.. వైభవ్ అరోరా బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా గోల్డెన్ డకౌటయ్యాడు. ట్రావిస్ హెడ్ తప్పించుకున్నా.. తొలి ఓవర్‌లోనే అభిషేక్ శర్మను స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

Story first published: Tuesday, May 28, 2024, 20:41 [IST]
Other articles published on May 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+