Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 Final: చెత్త బ్యాటింగ్‌తో చేతులెత్తేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్..!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే నమోదు చేసింది. మిచెల్ స్టార్క్(2/14), హర్షిత్ రాణా(2/14) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఎయిడెన్ మార్క్‌రమ్(23 బంతుల్లో 3 ఫోర్లతో 20)‌, ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీయగా.. ఆండ్రీ రస్సెల్(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు. ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ చెత్త రికార్డ్ నమోదు చేసింది.

IPL 2024 Final Hyderabad bowled out for 113 lowest total of IPL final

దెబ్బతీసిన స్టార్క్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లోనే అభిషేక్ శర్మ(2) క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. స్టార్క్ స్టన్నింగ్ డెలివరీకి అభిషేక్ శర్మ బిత్తరపోయాడు. వైభవ్ అరోరా వేసిన మరుసటి ఓవర్‌లోనే మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(0) కీపర్ క్యాచ్‌గా గోల్డెన్ డకౌటయ్యాడు.

ఇన్ ఫామ్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(9)ని స్టార్క్ తన మూడో ఓవర్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఓ సిక్సర్, బౌండరీ బాదడంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ 3 వికెట్లకు 40 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు అత్యల్ప పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం.

చెలరేగిన రాణా, రస్సెల్..
పవర్ ప్లే అనంతరం హర్షిత్ రాణా.. సన్‌రైజర్స్ పని పట్టాడు. దూకుడుగా ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి(13)ని కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్లాసెన్‌తో కలిసి మార్క్‌రమ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. రస్సెల్ దెబ్బతీసాడు. క్రీజులో సెట్ అయిన మార్క్‌రమ్‌(20) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

ఆ వెంటనే షెహ్‌బాజ్ అహ్మద్‌(8) వరుణ్ చక్రవర్తీ ఔట్ చేయగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అబ్దుల్ సమద్‌(4) రస్సెల్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. హెన్రీచ్ క్లాసెన్‌(16) హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేయడంతో సన్‌రైజర్స్ 90 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.

కమిన్స్ పోరాడినా..
ఈ పరిస్థితుల్లో జయదేవ్ ఉనాద్కత్(4) సాయంతో కమిన్స్ పోరాడాడు. అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్టార్క్ నేలపాటు చేయగా.. ఈ అవకాశంతో విలువైన పరుగులు రాబట్టి జట్టు స్కోర్‌ను 100 పరుగుల మార్క్‌ను ధాటించాడు. 23 పరుగుల స్వల్ప భాగస్వామ్యం అనంతరం జయదేవ్ ఉనాద్కత్(4) సునీల్ నరైన్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే రస్సెల్ బౌలింగ్‌లో కమిన్స్ క్యాచ్ ఔటవ్వడంతో సన్‌రైజర్స్ ఆలౌటైంది.

Story first published: Sunday, May 26, 2024, 21:21 [IST]
Other articles published on May 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+