సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఫైనల్లోనూ ఈ న్యూజిలాండ్ బ్యాటర్‌కు చోటు దక్కలేదు. దాదాపు జట్టులోని ప్రతీ ఒక్కరికి ఈ సీజన్‌లో ఏదో ఒక మ్యాచ్‌లో అవకాశం లభించగా.. గ్లేన్ ఫిలిప్స్‌కు మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 17 మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా అవకాశం ఇవ్వలేదు.
కనీసం ఫైనల్లోనైనా గ్లేన్ ఫిలిప్స్‌కు అవకాశం ఇస్తారని భావించినా.. సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ అతన్ని పూర్తిగా బెంచ్‌కే పరిమితం చేసింది. చెన్నై వేదికగానే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో ఎయిడెన్ మార్క్‌రమ్(1) దారుణంగా విఫలమయ్యారు. ఈ సీజన్‌లోనూ అతను పెద్దగా రాణించింది లేదు.

దాంతోనే కొన్ని మ్యాచ్‌లకు అతన్ని దూరం పెట్టారు. ఈ క్రమంలోనే స్పిన్ బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఫిలిప్స్‌కు ఫైనల్లో అవకాశం ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన షెహ్‌బాజ్ అహ్మద్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చిన సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్.. గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన అబ్దుల్ సమద్‌పై వేటు వేసింది.
అతని అవసరం ఏర్పడితే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే ఛాన్స్ ఉంది. అయితే గ్లేన్ ఫిలిప్స్‌కు చోటు ఇవ్వకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిలిప్స్ ఏమైనా టూర్‌కు వచ్చాడా? అని ప్రశ్నిస్తున్నారు. హెడ్ కోచ్ డానియల్ వెటోరికి ఫిలిప్స్‌కు ఏమైనా గొడవలున్నాయేమోనని కామెంట్ చేస్తున్నారు.
మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. డ్యూ రాదనే ధైర్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, షెహ్‌బాజ్ అహ్మద్, జయదేవ్ ఉనాద్కత్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్
కేకేఆర్: సునీల్ నరైన్, రెహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, వైభవ్ అరోరా