Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: జడేజాకో న్యాయం.. హార్దిక్ పాండ్యాకో న్యాయమా? అంతా అంబానీ మహిమ!

IPL 2024 Auction: ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తిగా క్యాష్ డీల్ ప్రకారం ఈ ట్రేడింగ్ జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు క్యాష్ డీల్ ట్రేడింగ్ అనేది నిబంధనల్లో ఉన్నదా? లేక హార్దిక్ పాండ్యా కోసమే ఈ కొత్త రూల్‌ను తీసుకొచ్చారా? అనే సందేహం కలుగుతోంది.

అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్ అందించడంతో పాటు గత సీజన్‌లో రన్నరప్‌గా నిలబెట్టిన హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ ఎందుకు వదులుకుంటోంది? అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అంతేకాకుండా రిటెన్షన్ ప్రక్రియలో హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకున్న తర్వాత ట్రేడింగ్ చేసుకున్నట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించడం మరింత గందరగోళానికి దారి తీసింది.

IPL 2024: Fans slams Mukesh Ambani for Hardik Pandya cash deal trade ahead of IPL 2024 Auction

గతంలో ఎన్నడూ లేని విధంగా.. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ట్రేడింగ్ విండోకు డిసెంబర్ 12 వరకు గడువు ఇవ్వడం అనేక సందేహాలకు తావిస్తోంది. అసలు గుజరాత్ టైటాన్స్‌ను వీడి ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లే అవసరం హార్దిక్ పాండ్యాకు ఏం ఉంది? అతనే స్వయంగా వెళ్తున్నాడా? ఫ్రాంచైజీల పరస్పర అంగీకారంతో ఈ ట్రేడింగ్‌కు ఒప్పుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.

ఒకవేళ హార్దిక్ పాండ్యానే ముంబై ఇండియన్స్‌ను సంప్రదిస్తే అది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించడం కాదా? ఐపీఎల్ 2010 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్న రవీంద్ర జడేజా.. ఇతర ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరపుతూ తన కాంట్రాక్ట్ ప్రైజ్ పెంచాలని బేరం ఆడాడని నిషేధం విధించారు.

ఇప్పుడు హార్దిక్ పాండ్యా సైతం ముంబై ఇండియన్స్‌తో సంప్రదింపులు జరిపాడనే ప్రచారం జరుగుతోంది. మరీ హార్దిక్ పాండ్యాపై ఎలాంటి చర్యలు ఉండవా? లేక ట్రేడింగ్ విండోతో పాటు ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ఏమైనా మార్చారా? ఇలా అనేక సందేహాలకు తావిచ్చిన హార్దిక్ పాండ్యా వ్యవహారంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం బీసీసీఐతో పాటు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్‌కు ఉంది.

IPL 2024: Fans slams Mukesh Ambani for Hardik Pandya cash deal trade ahead of IPL 2024 Auction

కానీ ఏ ఫ్రాంచైజీ కూడా ఇప్పటి వరకు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ముంబై ఇండియన్స్ ప్రాబల్యంతోనే ఈ క్యాష్ డీల్ ట్రేడింగ్ జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖేష్ అంబానీ గుప్పిట్లో ఐపీఎల్ ఉందని, అతను ఆడిందే ఆట పాడిందే పాటని, అవసరమైతే రూల్స్‌నే మార్చుతారని నెటిజన్లు మండిపడుతున్నారు.

గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఓనర్స్ ఎవరికీ తెలియకపోవడం.. లండన్‌కు చెందిన సీవీసీ క్యాపిటల్స్ కంపెనీ అని మాత్రమే తెలియడంతో బెదిరింపులకు పాల్పడటంతో పాటు వ్యాపార ఒప్పందాలతో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తమ జట్టులోకి తెచ్చుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ వ్యవహారం.. ఐపీఎల్‌కు మాత్రం మరింత చెడ్డ పేరు తెస్తోంది. అభిమానుల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తోంది.

Story first published: Monday, November 27, 2023, 15:09 [IST]
Other articles published on Nov 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+