For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: పృథ్వీ షా‌ వేటు వెనుక రికీ పాంటింగ్.. ఆసీస్ కోసం కుట్ర!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. 453 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. కెప్టెన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపిస్తున్నాడు. రిషభ్ పంత్‌ రీఎంట్రీని చూసి సంతోషించిన అభిమానులు.. తుది జట్టులో పృథ్వీ షా లేకపోవడం చూసి అవాక్కయ్యారు.

స్టార్ ఓపెనర్ అయిన పృథ్వీ షాను పక్కనపెట్టడం ఏందని ఆశ్చర్యపోయారు. పృథ్వీ షాకు బదులు మిచెల్ మార్ష్.. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలోనైనా పృథ్వీ షా ఉంటాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. రికీ భుయ్‌ కోసం పృథ్వీ షాను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

IPL 2024 Fans says Ricky Ponting is the reason behind Prithvi Shaw s non-selection in DC XI vs PBKS

పాపం పృథ్వీ షా..
అయితే ఈ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన పృథ్వీ షా సరైన గైడెన్స్ లేక కెరీర్‌ను నాశనం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వినోద్ కాంబ్లీలా మిగిలిపోతున్నాడని కామెంట్ చేస్తున్నారు. అండర్ 19 ప్రపంచకప్ విజయంతో తారా జువ్వలా దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు.

అరంగేట్ర టెస్ట్‌లోనే సెంచరీ చేసిన ఈ ముంబై బ్యాటర్.. గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. చిన్న వయసులోనే తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఫిట్‌నెస్ కోల్పోయాడు. తిరిగి ఆట మీద ఫోకస్ పెట్టి కమ్ బ్యాక్ చేసిన ప్రతీసారి అతన్ని దురదృష్టం వెంటాడింది. ఏదో గాయంతో ఆటకు దూరమయ్యాడు.

పృథ్వీ షాకు గాయమా..?
6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ సీజన్ రంజీ క్రికెట్ ఆడిన పృథ్వీ షా.. ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ బాది టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. దాంతో ఐపీఎల్ చెలరేగుతాడని అంతా అనుకున్నారు. కానీ ఢిల్లీ మేనేజ్‌మెంట్‌కు అతనికి చోటివ్వలేదు. దాంతో పృథ్వీ షాకు మళ్లీ గాయం అయిందా? అని కొందరు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

పాంటింగ్ కుట్ర..
మరికొందరు మాత్రం హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కుట్ర ఉందని కామెంట్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియాకు కలిసొచ్చేలా వార్నర్, మిచెల్ మార్ష్‌లను ఓపెనర్లుగా ఆడిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున వార్నర్-మార్ష్ ఓపెనర్లుగా కొనసాగుతున్నారు. తమ జట్టు కోసం రికీ పాంటింగ్.. పృథ్వీ షా కెరీర్‌ను నాశనం చేస్తున్నాడని ఘాటుగా విమర్శిస్తున్నారు.

పృథ్వీ షా ఆరాధ్య దైవమైన సాయి బాబాకే ఫిర్యాదు చేస్తున్నారు. 'సాయి బాబా పృథ్వీ షాకు చోటు లేదుగా..?'అని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Saturday, March 23, 2024, 16:53 [IST]
Other articles published on Mar 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+