For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: ‘నా గుండె పగిలింది’ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం!

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ.. తన గుండె పగిలిందనే అర్థం వచ్చే హార్ట్ బ్రేక్ లవ్ సింబల్‌ను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. దాంతో ముంబై ఇండియన్స్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్న సూర్యకుమార్ యాదవ్.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో చికిత్స తీసుకుంటున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించి ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2024 బరిలో నిలవాలనే పట్టుదలతో ఉన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. ఎన్‌సీఏ అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.

IPL 2024 Fans Confused after Suryakumar Yadav Shares Cryptic Instagram Story

సూర్యకుమార్ యాదవ్‌.. ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేస్తే ఎన్‌సీఏ అధికారులు ఐపీఎల్ ఆడేందుకు అనుమతివ్వనున్నారు. సూర్యకుమార్ యాదవ్ గాయం విషయంలో బీసీసీఐ ఆదేశాల కోసమే ఎదురు చూస్తున్నామని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ కూడా సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించాడు.

అయితే ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయకపోవడంతోనే సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ లవ్ సింబల్‌ను ఇన్‌స్టా స్టోరీలో పంచుకొని ఉంటాడని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే నిజమైతే ఐపీఎల్ 2024 సీజన్ ఫస్టాఫ్ మ్యాచ్‌లకు సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది. మరికొందరు మాత్రం హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం నచ్చకనే సూర్య ఇలా పోస్ట్ పెట్టాడని అభిప్రాయపడుతున్నారు.

గతంలో కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని వెల్లడించినప్పుడు కూడా సూర్య ఇలానే హార్ట్ బ్రేక్ లవ్ సింబల్‌ను షేర్ చేశాడు. మరికొందరు మాత్రం వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందనో.. ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారో.. లేక అతని సతీమణితో గొడవలు జరిగాయో..? అని అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

తన బాధకు గల కారణాన్ని సూర్యకుమార్ యాదవ్ స్వయంగా వెల్లడించనంత వరకు ఈ ఊహాగానాలు ప్రచారం అవుతూనే ఉంటాయి. ఐపీఎల్ 2024 సీజన్‌కు మార్చి 21న తెరలేవనుండగా.. మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.

Story first published: Tuesday, March 19, 2024, 15:50 [IST]
Other articles published on Mar 19, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+