Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs LSG: అందుకే అల్జారీ జోసెఫ్‌ను పక్కనపెట్టి అతన్ని తీసుకున్నాం: ఫాఫ్ డుప్లెసిస్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడ ఆడిన గత మ్యాచ్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పిచ్ చాలా స్లోగా ఉందని, బ్యాటింగ్‌కు కష్టమైందని తెలిపాడు.

దాంతోనే ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ తీసుకున్నామని వివరణ ఇచ్చాడు. పిచ్‌పై కొన్ని ప్రదేశాల్లో పొడిగా.. ప్యాచప్ వేసినట్లు కనబడుతుందన్నాడు. ఈ పిచ్‌ విసురుతున్న సవాళ్లకు సమాధానం కనుక్కోవాల్సి అవసరం తమపై ఉందని తెలిపాడు. గత పరాజయం తర్వాత తమ జట్టులో కీలకమైన చర్చలు చేశామని, తప్పిదాలను సవరించుకునే ప్రయత్నం చేశామన్నాడు.

IPL 2024 Faf du plessis Reveals The Reason Why Alzarri Joseph is not Playing vs LSG

మాయిశ్చర్ కూడా ఉండటంతో పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలని, అల్జారీ జోసెఫ్ స్థానంలో రీస్ టోప్లీ తుది జట్టులోకి వచ్చాడని తెలిపాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. రీస్ టోప్లీ అందుబాటులోకి రావడంతోనే అల్జారీ జోసెఫ్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందన్నాడు.

సొంతగడ్డపై మరో జట్టు తరఫున బరిలోకి దిగడం భిన్నంగా ఉందని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. హోమ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌ నుంచి బయటకు వచ్చేవాడినని, ఇప్పుడు విజిటింగ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌ నుంచి బయటకి రావడం విచిత్రంగా ఉందన్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో తాము తమ సత్తా ఏంటో చూపించామని తెలిపాడు.

'జట్టులో ప్రతీ ఒక్కరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ.. ఇదే జోరును మేం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడిని పెంచుతాం. గత మ్యాచ్‌లో మా విజయం కంటే మయాంక్ పేస్ గురించే ఎక్కువ చర్చ జరిపారు.

అతను మా జట్టు ఫస్ట్ సీజన్ నుంచి మాతోనే ఉన్నాడు. దురదృష్టవశాత్తు గాయంతో గత సీజన్ ఆడలేదు. తుది జట్టులో ఒకే ఒక మార్పు చేశాం. వెన్ను నొప్పితో బాధపడుతున్న మోహ్‌సిన్ ఖాన్ స్థానంలో యశ్ ఠాకూర్‌ను తీసుకున్నాం.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, రజత్ పటీదార్, దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్(కీపర్), మయాంక్ దగర్, రీస్ టోప్లీ, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్.

Story first published: Tuesday, April 2, 2024, 19:29 [IST]
Other articles published on Apr 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+