IPL 2024: గోల్డెన్ ఛాన్స్ మిస్.. టీ20 ప్రపంచకప్ టీమ్ నుంచి దినేశ్ కార్తీక్ ఔట్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కెరీర్ చివరి దశలో ఉన్న దినేశ్ కార్తీక్.. ఐపీఎల్ 2024 సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. తనదైన హిట్టింగ్‌తో ఆర్‌సీబీకి మంచి ఫినిషర్‌గా మారాడు. నిలకడగా రాణిస్తూ.. టీ20 ప్రపంచకప్ జట్టు రేసులో నిలిచాడు.
అసాధారణ ప్రదర్శనతో అతను సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ సైతం దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ ఘోర తప్పిదం చేశాడు. అతను చేసిన ఈ మిస్టేక్ ఆర్‌సీబీ విజయవకాశాలను దెబ్బతీయడంతో పాటు వరల్డ్ కప్ రేసు నుంచి తప్పుకునేలా చేసింది.

ఆర్‌సీబీ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు కావాల్సిన సమయంలో దినేశ్ కార్తీక్ బ్లండర్ మిస్టేక్ చేశాడు. 19వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్ ఓ సిక్సర్, బౌండరీ బాదాడు. కానీ ఆ తర్వాతి మూడు బంతులను డాట్ చేయడంతో ఔటయ్యాడు. సింగిల్ తీసే ప్రయత్నం కూడా చేయలేదు.
ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. కర్ణ్ శర్మ మూడు సిక్స్‌లు బాది ఆశలు రేకెత్తించాడు. కానీ 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన స్థితిలో అతను ఔటవ్వడంతో కేకేఆర్ ఒక్క పరుగుతో గెలిచింది. దాంతో దినేశ్ కార్తీక్ సింగిల్ తీసి కర్ణ్ శర్మకు బ్యాటింగ్ ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలోనే దినేశ్ కార్తీక్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడలేని దినేశ్ కార్తీక్‌ను టీ20 ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయకపోవడమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా కేకేఆర్‌పై ఆర్‌సీబీని దినేశ్ కార్తీక్ గెలిపించి ఉంటే అతన్ని ప్రపంచకప్ జట్టులోకి తీసుకునే అవకాశాలు మెరుగయ్యేవి.
ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ ఏడింటిలో ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. టోర్నీలో మిగిలిన 6 మ్యాచ్‌లకు ఆరు గెలిచినా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications