Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 వేలం తర్వాత పటిష్టంగా ఢిల్లీ.. తుది జట్టు అంచనా ఇదే!

DC Palying XI: ఐపీఎల్ చరిత్రలోనే ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ సారైన ఆ ముచ్చట తీర్చుకోవాలనే కసితో ఉంది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ డేర్ డేవిల్స్‌గా ఆశించిన ఫలితం సాధించలేక ఢిల్లీ క్యాపిటల్స్‌గా మారినా.. అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. పేరు మార్చిన తర్వాత వరుసగా ప్లే ఆఫ్స్ చేరడంతో పాటు ఐపీఎల్ 2021లో ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకుంది.

ఐపీఎల్ 2022 సీజన్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్న ఢిల్లీ.. గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో చిట్టి చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. రోడ్డు ప్రమాదంతో కెప్టెన్ రిషభ్ పంత్ జట్టుకు దూరమవ్వడం.. ఫామ్‌లో లేని డేవిడ్ వార్నర్‌ జట్టును నడిపించడంతో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.

IPL 2024: Delhi Capitals strongest playing 11 after Mini Auction

రోడ్డు ప్రమాదంతో గతేడాదిగా క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషభ్ పంత్.. ఐపీఎల్ 2024 సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అతను ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. ఐపీఎల్ 2024 వేలంలో టీమ్ ప్రతినిథిగా పాల్గొన్నాడు. వేలంలో ఢిల్లీ క్యాటిల్స్ తమ బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేసింది. హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, జై రిచర్డ్‌సన్ వంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. భారత అనామక వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రను రూ. 7.20 లక్షల భారీ ధరకు తీసుకుంది.

టీమ్ కాంబినేషన్..
ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పృథ్వీ షా గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతని ఫిట్‌నెస్ సాధిస్తేనే ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. లేదంటే యశ్ ధుల్‌కు అవకాశం దక్కుతుంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వన్డే, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన అతను కేవలం టీ20 క్రికెట్ మాత్రమే ఆడనున్నాడు.

ఐపీఎల్ ముందు మరిన్నీ విదేశీ టీ20 లీగ్‌ల్లో అతను పాల్గొననున్నాడు. మిడిలార్డర్‌లో మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, హ్యారీ బ్రూక్ బరిలోకి దిగనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున దారుణంగా విఫలమైన హ్యారీ బ్రూక్.. ఢిల్లీ తరఫున ఎలా ఆడుతాడో చూడాలి.

మిచెల్ మార్ష్ మంచి ఫామ్‌లో ఉండగా.. రిషభ్ పంత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడా? లేక కెప్టెన్‌గా పూర్తి మ్యాచ్ ఆడుతాడా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ పంత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగితే కుమార్ కుశాగ్ర వికెట్ కీపింగ్ చేయనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ బరిలోకి దిగనుండగా.. కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడనున్నాడు. ముఖేష్ కుమార్, అన్రిచ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైనప్ బీకరంగా ఉండగా.. బౌలింగ్‌లో మూడో పేసర్ లోటు కనిపిస్తోంది. ఖలీల్ అహ్మద్ రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు (అంచనా)
డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, హ్యారీ బ్రూక్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అన్రిచ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్

ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
హ్యారీ బ్రూక్(రూ. 4 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్(రూ. 50 లక్షలు), రిక్కీ భూయ్( రూ. 20 లక్షలు), కుమార్ కుశాగ్ర(రూ. 7.20 కోట్లు), రషిక్ దార్(రూ. 20 లక్షలు),
జై రిచర్డ్‌సన్(రూ. 5 కోట్లు), సుమిత్ కుమార్ (రూ. కోటి), షై హోప్(రూ. 75 లక్షలు)

ఢిల్లీ క్యాపిటల్స్:
పృథ్వీ షా, రిషబ్ పంత్, అభిషేక్ పోరెల్, డేవిడ్ వార్నర్, కుమార్ కుశాగ్రా, రిక్కీ భుయ్, స్వస్తిక్ చికారా, షాయ్ హోప్, ట్రిస్టాన్ స్టబ్స్, హ్యారీ బ్రూక్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వల్, యష్ ధుల్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, లుంగీ ఎంగిడీ, ముకేశ్ కుమార్, అన్రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్, ఝై రిచర్డ్‌సన్. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద ఇంకా రూ.9.90 కోట్ల పర్స్ ఉంది.

Story first published: Wednesday, January 10, 2024, 17:47 [IST]
Other articles published on Jan 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+