Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 ఫస్టాఫ్ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. సన్‌రైజర్స్ మ్యాచ్ ఎప్పుడంటే..?

ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2024 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సీజన్‌ను బీసీసీఐ రెండు దశల్లో నిర్వహించనుంది. ఈ క్రమంలోనే ఫస్టాఫ్ షెడ్యూల్ వివరాలను టోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమా ద్వారా గురువారం వెల్లడించింది.

ముందుగా ప్రచారం జరిగినట్లే మార్చి 22న ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాకపోవడంతో బీసీసీఐ ఏప్రిల్ 7 వరకే షెడ్యూల్‌ను ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి.

 IPL 2024: CSK vs RCB on March 22, fixtures for first 21 games released

సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనుంది. హైదరాబాద్ వేదికగా మార్చి 27న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వరకు జరిగే ఈ ఫస్టాఫ్ టోర్నీలో మొత్తం 21 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 4 డబుల్ హెడర్స్ ఉన్నాయి.


ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండు హోమ్ మ్యాచ్‌లను వైజాగ్ వేదికగా ఆడనుంది. ఢిల్లీ ఫ్రాంచైజీలో తెలుగు వ్యాపారవేత్తల భాగస్వామ్యం ఉండటంతో వైజాగ్‌ను హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఫస్టాఫ్ షెడ్యూల్‌లో హైదరాబాద్ వేదికగా రెండు మ్యాచ్‌లు మాత్రమే జరగనున్నాయి. మార్చి 23న ముంబైతో తొలి మ్యాచ్ జరగనుండగా.. ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌తో మరో మ్యాచ్ జరగనుంది.
Story first published: Thursday, February 22, 2024, 18:09 [IST]
Other articles published on Feb 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+